Vegetable Farming : 2 ఎకరాల్లో కూరగాయల సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం

డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు.

Vegetable Farming : 2 ఎకరాల్లో కూరగాయల సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం

Profits in Vegetable Farming

Vegetable Farming : రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా,  దఫ దఫాలుగా పంటలు వేసుకుంటే.. ఏడాది పొడవునా దిగుబడులను తీయవచ్చు. అంతే కాదు.. మార్కెట్ లో ఒకసారి కాకపోయినా, మరోసారైనా మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. ఈ సూత్రాన్నే అమలు పరుస్తూ.. ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తూ..  అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు .

READ ALSO : Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

కాకర, క్యాబేజి ,టమాట,దోస ఇలా ఒకే క్షేత్రంలో ఒక పంట చివరి దశలో మరోపంటను విత్తి దిగబడిని తీసుకునే విధంగా ప్రణాళిక బద్దంగా సాగుచేస్తున్న ఈ రైతే పేరు యుగంధర్ రెడ్డి. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, నారమ్మగూడెం గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగుచేస్తూ.. నిరంతరం పంట దిగుబడులను తీస్తున్నాడు.

రైతు యుగందర్ రెడ్డి కి నాగర్జున సాగర్ ఎడుమ కాలువ కింద 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఎప్పుడు వరిసాగుచేసేవారు. అయితే ఏ ఏటికాయేడు పెట్టుబడులు పెరిగిపోవటం.. ఇటు దిగుబడులు కూడా తగ్గిపోతు వస్తున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో ధర రాక నష్టాలపాలవుతున్నారు.

READ ALSO : Pests In Brinjal : వంగసాగులో చీడపీడలు…నివారణ

ఈ సమస్యలనుండి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూరగాయల సాగును ఎంచుకున్నారు. 8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు.

READ ALSO : Cultivation Of Brinjal : బెంగలేని వంగ సాగు.. ఏడాదిపాటుగా మంచిదిగుబడులు

డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు. ఇలా ఏడాదంతా ఒక పంట పూర్తి అవుతుండగానే మరో అంతర పంట నుండి దిగుబడులను పొందుతూ.. అధిక ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Okra Crop : బెండ‌సాగులో మేలైన యాజమాన్యం

మార్కెట్ కు అనుగుణంగా కూరగాయలు పండిస్తున్న రైతు యుగంధర్ రెడ్డి ఏడాదికి రెండు ఎకరాలపై దాదాపు 4 లక్షల 50 వేల నికర ఆదాయం పొందుతున్నారు. అంతే కాదు తనతో పాటే మరికొంత మందికి పనికల్పిస్తున్నారు. ఈ రైతు సాగు విధానాన్ని చూసిన చుట్టుప్రక్కల రైతులు సైతం కూరగాయలు పండించేందుకు ముందుకు వస్తున్నారు.