Project K : ప్రాజెక్ట్ K అప్డేట్.. సినిమాల్లో విలన్స్ వీళ్లేనా?? మరో ఆసక్తికర వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

ఇటీవల ప్రాజెక్ట్ K సినిమా నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు.

Project K : ప్రాజెక్ట్ K అప్డేట్.. సినిమాల్లో విలన్స్ వీళ్లేనా?? మరో ఆసక్తికర వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Project K Update Assembling The Raiders video released

Project K :  రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఆదిపురుష్(Adipurush) సినిమా రాబోతుంది. మరో పక్క సలార్(Salaar), ప్రాజెక్ట్ K, మారుతి(Mruthi) సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిలో సలార్, ప్రాజెక్ట్ K సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K.

ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ అంటూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ డిస్కషన్ జరుగుతుంది. చిత్రయూనిట్ ఆ రైడర్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. రైడర్స్ మేకింగ్ వీడియోని చూపించారు. గ్రాఫిక్స్ లో రైడర్స్ అనే వాళ్ళని ఎలా తయారు చేశారు, షూటింగ్ ఎలా చేస్తున్నారు అని చూపించారు. దీంతో ఈ వీడియో చూశాక రైడ్ఫర్స్ ఈ సినిమాలో విలన్స్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. కొంతమంది ప్రభాస్ తరపున ఉండే సైన్యం అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సినిమాలో ఈ రైడర్స్ అనే వాళ్ళు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.

Project K Update Assembling The Raiders video released

Renu Desai : రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణుదేశాయ్.. కొనసాగుతున్న రచ్చ..

ఈ వీడియో, గతంలోకి కొన్ని పోస్టర్స్ చూశాక ఇది ఓ యుద్ధానికి సంబంధించిన కథ కూడా అయి ఉండొచ్చు అని అర్ధమవుతుంది. ప్రాజెక్ట్ K నుంచి సడెన్ గా ఈ వీడియో రిలీజ్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూశాక సినిమాపై మరిన్ని అంచనాలునెలకొన్నాయి. ఇక ప్రాజెక్ట్ K సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్.