Renu Desai : రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణుదేశాయ్.. కొనసాగుతున్న రచ్చ..
గతంలోనే రేణు దేశాయ్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఊరుకోము అంటూ కొంతమంది పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. విడిపోయిన తర్వాత చాలా ఏళ్ళు రేణు దేశాయ్ సైలెంట్ గానే ఉంది.

Renu Desai Vs Pawan Kalyan fans social media war
Renu Desai : ఒకప్పటి హీరోయిన్ గా కంటే కూడా ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే రేణు దేశాయ్ బాగా పాపులర్. పవన్ తో సహజీవనం చేసి, అనంతరం పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలకు తల్లయి సినిమాలకు దూరంగా ఉంది. కానీ కొన్ని కారణాలతో పవన్, రేణు దేశాయ్ లు విడిపోయారు. వీరు విడిపోయినా పిల్లలను మాత్రం పవన్ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాడు. విడిపోయాక పవన్ వేరే పెళ్లి చేసుకున్నా, రేణు దేశాయ్ మాత్రం చేసుకోలేదు. దీనికి ఒక రకంగా పవన్ అభిమానులు కూడా కారణమే.
గతంలోనే రేణు దేశాయ్ ఇంకో పెళ్లి చేసుకుంటే ఊరుకోము అంటూ కొంతమంది పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు. విడిపోయిన తర్వాత చాలా ఏళ్ళు రేణు దేశాయ్ సైలెంట్ గానే ఉంది. చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా ఇటీవలే సినిమాలు, షోలు, యాడ్స్ తో కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ, టీవీ షోలు, యాడ్స్ చేస్తోంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడని రేణు, గత రెండు రోజుల నుంచి మాత్రం పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతుంది.
ఏప్రిల్ 8న పవన్, రేణు దేశాయ్ తనయుడు అకిరా పుట్టిన రోజు కావడంతో కొంతమంది అకిరా ఫోటో లేదా వీడియొ పెట్టాలని రేణు దేశాయ్ సోషల్ మీడియాలకు మెసేజ్ లు, కామెంట్స్ చేశారు. కొంతమంది పవన్ అభిమానులు హద్దు మీరి మరీ వ్యాఖ్యలు చేయడంతో రేణు దేశాయ్ వాటిని స్టోరీలో పోస్ట్ చేసి, అలాంటి వారందరిపై ఫైర్ అయింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోయారు.
Pawan Kalyan : అకీరా బర్త్ డే రోజు రేణుదేశాయ్‌ని బాధ పెట్టిన పవన్ ఫ్యాన్స్.. మరి అలాంటి కామెంట్స్?
అనంతరం ఆదివారం నాడు రేణు దేశాయ్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఎవరో ఒక మహిళ ఇంటర్వ్యూలో.. రేణు దేశాయ్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ, రేణు దేశాయ్ ఎంత బాధ అనుభవించిందో, రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకోవద్దు అనే పవన్ అభిమానులు, పవన్ కి ఎందుకు చెప్పలేదు అంటూ.. ఇలా అనేక కామెంట్స్ చేసింది. ఈ వీడియోలో ఒకరకంగా పవన్ అభిమానుల మీద ఫైర్ అవుతూనే, ఇండైరెక్ట్ గా పవన్ ని కూడా విమర్శిండం జరిగింది.
Samantha : రెండేళ్లలో చాలా జరిగాయి.. జీవిత పాఠాలు నేర్చుకున్నాను..
ఈ వీడియోని షేర్ చేస్తూ రేణు దేశాయ్.. ఆవిడ ఎవరో తెలీదు, ఆవిడ నా గురించి ఎందుకు మాట్లాడారో తెలీదు, కానీ ఈ వీడియో చూశాక పబ్లిక్ లో నాకంటూ ఒకరు సపోర్ట్ చేశారని ఏడ్చేసాను. నా బాధ ఆవిడ మాట్లాడింది. ఇన్నేళ్ల నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆవిడ చెప్పింది. ఇప్పుడు నేను ఇలాంటివి ఏమన్నా పెట్టి మాట్లాడితే పొలిటికల్ గా పవన్ ని పడగొట్టడానికి ఇలాంటివి చేస్తుంది అని మళ్ళీ నన్నే అంటారు ఫ్యాన్స్. నాకు ఈ వీడియో చూశాక నన్ను కూడా అర్ధం చేసుకునే వారు ఉన్నారనిపించింది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.
దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు తీవ్రంగా దారుణమైన విమర్శలు చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్ కింద కామెంట్స్, రేణుదేశాయ్ కి మెసేజ్ లు చేస్తున్నారు. వాటిల్లో ఓ నెటిజన్ వల్గర్ గా మాట్లాడుతూ పెట్టిన మెసేజ్ ని రేణు షేర్ చేసి.. మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే ఇలా ఎలా మెసేజ్ చేయగలుగుతున్నారు. ఒకసారి ఇది మీ అమ్మకు చూపించి అడగండి అని సీరియస్ గా పోస్ట్ చేసింది రేణు దేశాయ్. పవన్, రేణు దేశాయ్ విడిపోయిన చాలా ఏళ్ళకి ఇలా రేణు దేశాయ్ ఓపెన్ అయి మాట్లాడుతుండటం, పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ గా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అంటూ రచ్చ జరుగుతుంది. ఇక పలువురు మాత్రం రేణు దేశాయ్ బాధని అర్ధం చేసుకొని ఆమెకి సపోర్ట్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
View this post on Instagram