Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆగ కూడదని పునీత్ తీసుకున్న నిర్ణయం కంటతడి పెట్టిస్తుంది..

Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..

Puneeth Rajkumar Social Service

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట ఇంకా నమ్మబుద్ధి కావడం లేదంటూ అభిమానులు, కర్ణాటక ప్రజలు, శాండల్‌వుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన సినిమా వారు అంటున్నారు. పునీత్ గురించిన వార్తలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి.

Puneeth Rajkumar : మేమిద్దరం అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం.. ఎమోషనల్ అయిన సూర్య

ఒక లెజెండరీ యాక్టర్ కొడుకు, స్టార్ హీరో తమ్ముడు అయినా కూడా ఆయన చాలా సామాన్యంగా ఉంటారనేది అందరూ చెప్పేమాట. పునీత్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పునీత్ చిన్ననాటి పిక్స్, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు.. ముఖ్యంగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, సోషల్ సర్వీస్ గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

ఒకటి, రెండు కాదు ఏకంగా 45 ఫ్రీ స్కూళ్లు, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు అలాగే 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యనందించారు పునీత్. ఎన్నో బాధ్యతలతో, సామాజిక సృహతో నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా చెరగని ముద్ర వేసిన పునీత్ తన కళ్లను దానం చేశారు.

Puneeth Rajkumar : పునీత్ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలి – రాజేంద్ర ప్రసాద్

ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆగ కూడదని.. ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఇబ్బంది ఏర్పడినా కూడా సామాజిక సేవలు కొసాగించేలా.. ముందు జాగ్రత్తగా 8 కోట్ల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు పునీత్.

Puneeth Rajkumar : చెప్పులు విడిచి నివాళి… పునీత్ అభిమానుల ప్రేమకు సలాం..

ఈ వార్త తెలిసిన అభిమానులు, కన్నడ ప్రజలు.. నెటిజన్లు ‘సేవా కార్యక్రమాలు ఆగకూడదని ముందు జాగ్రత్తగా ఇలా చెయ్యడం గ్రేట్.. నిజంగా నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా.. ఇంత మంచి మనసున్న మనిషిని మనకి దూరం చేశాడు దేవుడు’ అంటూ ఎమోషనల్ అవుతున్నారు.

Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..