Pushpa : ‘పుష్ప’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో రెండు రోజుల్లో..

ఇప్పటికే అల్లు అర్జున్ స్వయంగా వేరే సినిమా ఫంక్షన్స్ కి వెళ్లి, టీవీ షోలకి గెస్ట్ గా వెళ్లి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్.....

Pushpa : ‘పుష్ప’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో రెండు రోజుల్లో..

Pushpa

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘పుష్ప’. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమాగా రాబోతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. వీటితో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. మరో వారం రోజులు మాత్రమే ఉండగా ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ ట్రైన్‌లో 3000 మంది అభిమానులు

ఇప్పటికే అల్లు అర్జున్ స్వయంగా వేరే సినిమా ఫంక్షన్స్ కి వెళ్లి, టీవీ షోలకి గెస్ట్ గా వెళ్లి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 12న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరపనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. MAASive Pre Release Event అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు రానున్నారు.

Prabhas : ఆసియాలోనే నంబర్ వన్ సెలబ్రిటీగా ప్రభాస్

దీంతో ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇటీవల అఖండ ఫంక్షన్ కి అల్లు అర్జున్ వెళ్లడంతో బాలయ్య బాబు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే సూచనలు ఉన్నాయని టాక్. అంతే కాక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమా యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా అభిమానులు మాత్రం ఈ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.