Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్

'పుష్ప' సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. అయితే థియేటర్ లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ ప్రింట్ లో కలిపారు. అలాగే సమంత నటించిన ఐటెంసాంగ్ 'ఊ అంటావా ఊ ఊ అంటావా'...

Allu Arjun : ‘పుష్ప’ సినిమా.. థియేటర్లో ఒక ప్రింట్.. ఓటీటీలో మరో ప్రింట్

Pushpa

Pushpa Movie :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘పుష్ప’. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ‘పుష్ప’ అన్ని చోట్ల మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ ని సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది. కానీ సినిమా రిలీజ్ అయిన 20 రోజులకే ఓటీటీకి తీసుకొచ్చారు. ‘పుష్ప’ సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.

1945 Movie : క్లైమాక్స్ లేకుండా రిలీజ్ చేసిన రానా సినిమా.. నాకేం సంబంధం లేదు అంటున్న రానా

అయితే థియేటర్ లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ ప్రింట్ లో కలిపారు. అలాగే సమంత నటించిన ఐటెంసాంగ్ ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటలో కూడా కొన్ని విజువల్స్ అదనంగా జత చేశారు. అలాగే కొన్ని సాగదీసిన సన్నివేశాలని కూడా కట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ ప్రింట్ కి ఓటీటీకి కొంచెం తేడా ఉందని, సినిమాని మళ్ళీ చూడొచ్చని అంటున్నారు. అయితే ఇదంతా సినిమా మళ్ళీ మళ్ళీ చూడటానికే చిత్ర బృందం ఇలా చేశారని అంటున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఏది ఏమైనా థియేటర్లలో సక్సెస్ అయిన పుష్ప ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.