1945 Movie : క్లైమాక్స్ లేకుండా రిలీజ్ చేసిన రానా సినిమా.. నాకేం సంబంధం లేదు అంటున్న రానా

నాలుగేళ్ల క్రితం రానా హీరోగా '1945' అనే సినిమాని అనౌన్స్ చేశారు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తి అయ్యాక సినిమా...........

1945 Movie : క్లైమాక్స్ లేకుండా రిలీజ్ చేసిన రానా సినిమా.. నాకేం సంబంధం లేదు అంటున్న రానా

Rana

1945 Movie :  ఒక్కోసారి కొన్ని సినిమాలు మొదలయి అనివార్య కారణాల వల్ల షూటింగ్ దశలోనే, లేక ఏదో ఒక దశలోనో ఆగిపోతాయి. ఆ సినిమాల మీద అందులో నటించిన వాళ్ళు హోప్స్ వదిలేసుకుంటారు. ఇలాంటి వాటి వల్ల నిర్మాతలకి, డైరెక్టర్స్ కి తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. స్టార్ హీరోలకి సైతం ఇలా మిగిలిపోయిన సినిమాలు ఉన్నాయి. అందులో రానా దగ్గుబాటి కూడా ఒకరు.

నాలుగేళ్ల క్రితం రానా హీరోగా ‘1945’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. బ్రిటీష్ పాలన నేపథ్యంలో 1945 సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా రెజీనా నటించింది. ఈ సినిమాని నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. అయితే ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తి అయ్యాక సినిమా డైరెక్టర్ స‌త్య శివతో రానాకి విభేదాలు ఏర్పడ్డాయి. ఇదే కాక మరిన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు రానా. దీంతో ఈ సినిమా ఆగిపోయింది.

Raai Laxmi : డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసిన లక్ష్మి‌రాయ్

అయితే ఇటీవల ఈ సినిమాని రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు సినిమా డైరెక్టర్, నిర్మాతలు. దీనికి రిప్లైగా రానా ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ట్వీట్ కూడా చేశాడు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలన్ని వాయిదా పడటంతో చిన్న సినిమాలు ఒక్కసారిగా సంక్రాంతి రేసులోకి వచ్చాయి. ఇదే అదను అనుకోని 1945 నిర్మాత ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే క్లైమాక్ లేకుండానే ఈ సినిమాని నిన్న జనవరి 7న రిలీజ్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు క్లైమాక్ లేదు అని, సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక స్టార్ హీరో సినిమా ఆగిపోయిన తర్వాత ఇలా క్లైమాక్స్ లేకుండా రిలీజ్ అవ్వడం గమనార్హం.