Raai Laxmi : డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసిన లక్ష్మి‌రాయ్

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. దుబాయ్ లో డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసినట్లు తెలిపింది. హీరోయిన్ రాయ్ లక్ష్మి దుబాయ్ కి వెళ్లగా.........

Raai Laxmi : డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసిన లక్ష్మి‌రాయ్

Raai Laxmi (1)

Raai Laxmi :  ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి రాయ్ కి ఆ తర్వాత తెలుగులో ఆశించినంతగా ఛాన్సులు రాలేదు. తమిళ్ లో వరుసగా హీరోయిన్ గా చేస్తూ తెలుగులో మాత్రం వరుస ఐటెం సాంగ్స్ చేస్తుంది రాయ్ లక్ష్మి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. దుబాయ్ లో డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసినట్లు తెలిపింది.

దుబాయ్ లో డాల్ఫినారియం అనే ఓ సంస్థ ఉంది. అక్కడ ఇండోర్ లో స్విమ్మింగ్ ఫూల్స్ నిర్మించి డాల్ఫిన్స్ ని పెంపుడు జంతువులు లాగా పెంచుతారు. డాల్ఫిన్స్ మాత్రమే కాక మరి కొన్ని సముద్ర జంతువులు, పక్షులని కూడా పెంచుతారు. వీటితో సర్కస్ నిర్వహించినట్లు స్పెషల్ షోస్ చేస్తారు. ఈ షోలు చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ షోలు చూసి ఎంజాయ్ చేయడమే కాక డాల్ఫిన్స్ తో కలిసి స్విమ్ చేయొచ్చు. వాటితో ఆడుకోవచ్చు, ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. దీంతో ఈ బిజినెస్ కి జనాల ఆదరణ బాగుంది. సెలెబ్రిటీలు కూడా దుబాయ్ వెళ్తే ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు.

Sathyaraj : ‘కట్టప్ప’కి కరోనా.. ఆస్పత్రిలో చేరిక

తాజాగా హీరోయిన్ రాయ్ లక్ష్మి దుబాయ్ కి వెళ్లగా ఈ డాల్ఫినారియంకి వెళ్ళింది. అక్కడ డాల్ఫిన్స్ తో కలిసి స్విమ్ చేసింది. ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా డాల్ఫిన్స్‌తో స్విమ్ చేస్తుంటే. ఇలాంటి సెటప్ ని సృష్టించినందుకు డాల్ఫినారియం వాళ్ళకి చాలా థ్యాంక్స్” అంటూ పోస్ట్ చేసింది రాయ్ లక్ష్మి.