Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్

కరోనా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి భారీ సక్సెస్ బోణీ కొట్టేసింది. బాలయ్య మాస్ జాతరతో అఖండ విజయాన్ని అందుకున్నాడు. అఖండ సక్సెస్ తో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ పుష్ప మీదకి మళ్లింది.

Pushpa: తగ్గేదేలే.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ వచ్చేస్తున్నాయ్

Pushpa

Pushpa: కరోనా తర్వాత తెలుగు సినీ పరిశ్రమకి భారీ సక్సెస్ బోణీ కొట్టేసింది. బాలయ్య మాస్ జాతరతో అఖండ విజయాన్ని అందుకున్నాడు. అఖండ సక్సెస్ తో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ పుష్ప మీదకి మళ్లింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే తొలిసారి పాన్ ఇండియా మూవీతో రావడంతో బాలయ్య-బోయపాటి మాదిరే సుకుమార్ తో స్టైలిష్ స్టార్ కు హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా ఒక్కో అప్డేట్ వదులుతూ తగ్గేదేలే అంటూ ఆకాశమే హద్దుగా డిక్లేర్ చేసేస్తున్నారు.

Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్పకు మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. ట్రైలర్ కు ముందు గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ట్రైలర్ కట్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్, త్వరలోనే ట్రైలర్ కి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Bollywood New Films: కొత్తగా కనిపిస్తున్న బాలీవుడ్.. అన్నీ ఇంటెన్స్ డ్రామాలే

బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ గెటప్ లో కనిపించనుండగా.. రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ తో పాటు.. సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఒక ఊపేస్తే ట్రైలర్ ఇక ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇది చాలదని ఇప్పుడు గ్లింప్స్ కూడా అంటే అభిమానులు ఖుష్ అవడం ఖాయం.