Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Avika Gor: అందంతో కట్టిపడేస్తున్న అవికా..!

పుష్ప.. సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ.. ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. వరసగా వచ్చిన పాటలు కూడా ఒక ఊపేస్తున్నాయి. ఇక టీజర్ సంగతైతే చెప్పేదే లేదు. ఈ వీడియోకి యూ ట్యూబ్ లో 89 మిలియన్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ అయితే.. 2 మిలియన్ కి పైగా లైక్స్ రావడం విశేషం.

Srikanth Iyengar: నలభై ఏడేళ్లకు బ్రేక్‌ వచ్చింది.. నిలబెట్టుకునేందుకే ప్రయత్నం

2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్ గా పుష్ప టీజర్ పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ కు 466కే కామెంట్స్ వచ్చేయంటే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో ఎంతగా చర్చ జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, సినిమా రిలీజ్ అయితే ఏ రికార్డ్స్ బద్దలు అవుతాయో చూడాలి మరి.