Srikanth Iyengar: నలభై ఏడేళ్లకు బ్రేక్‌ వచ్చింది.. నిలబెట్టుకునేందుకే ప్రయత్నం

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది నటీనటులు చెప్తుంటే వినేఉంటారు. అయితే.. కొద్ది మంది మాత్రం డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ అవుతారు. సీనియర్ హీరోలలో డాక్టర్ రాజశేఖర్ లాంటి..

Srikanth Iyengar: నలభై ఏడేళ్లకు బ్రేక్‌ వచ్చింది.. నిలబెట్టుకునేందుకే ప్రయత్నం

Srikanth Iyengar

Srikanth Iyengar: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది నటీనటులు చెప్తుంటే వినేఉంటారు. అయితే.. కొద్ది మంది మాత్రం డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ అవుతారు. సీనియర్ హీరోలలో డాక్టర్ రాజశేఖర్ లాంటి వాళ్ళు ఇందుకు ఉదాహరణ. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ అనే నటుడు కూడా డాక్టర్ అయ్యాకే యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. డాక్టర్ గా సేవ చేసి నటన మీద పిచ్చితో వైద్య వృత్తిని పక్కకి పెట్టేసి కెమెరా ముందుకొచ్చాడు.

Abhishek Bachchan: ఇకనైనా ఈ మామ బట్టలు వేసుకోకు.. అల్లుడికి అభిషేక్ బర్త్ డే విషెష్!

తెలుగులో డియర్ కామ్రేడ్, మెహబూబా, దిశా ఎన్కౌంటర్, మర్డర్, అమరం అఖిలం ప్రేమ, బ్రోచేవారెవరురా.. తాజాగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ ఇప్పుడు 1947 అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీకాంత్ తనకి 47 ఏళ్ల వయసులో బ్రేక్ దక్కిందని దాన్ని నిలిబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.

Republic: దేవాకట్టా మరో ప్రయోగం.. డైరెక్టర్ కామెంటరీతో ఓటీటీ స్ట్రీమింగ్!

ఇక శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘1997’ సినిమా గురించి చెప్తూ.. డా॥మోహన్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారని.. ఈ నెల 26న ఈ సినిమా విడుదలకానుందని చెప్పాడు. ‘నేటి సమాజంలో కుల, వర్ణ వివక్ష పెరిగింది. దేవుడు, మతం పేరుతో విద్వేషాల్ని సృష్టిస్తున్నారు. ఈ విషవలయంలో సామాన్యుడు ఎలా సమిధగా మారిపోతున్నాడనే అంశాలతో దర్శకుడు మోహన్‌ ఆలోచనాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పాడు.

Evaru Meelo Koteeswarulu: నీకంటే కంప్యూటర్ బెటర్.. మహేష్-తారక్ ఫన్నీ ప్రోమో!

ఇందులో శ్రీకాంత్ పాత్ర విషయానికి వస్తే.. పూర్తిగా నెగెటివ్‌ షేడ్స్‌తో కూడిన పాత్ర చేశానని.. ఈ పాత్రలో నటిస్తున్న సమయంలో నిజంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అనే ఏహ్య భావన కలిగింది. సినిమా చూసే ప్రేక్షకులకు ఇంకా అసహ్య భావన కలుగుతుందని.. అంతగా తన పాత్రని మలిచారని శ్రీకాంత్ చెప్పాడు. మరి, అంతగా ఈ పాత్రలో ఏముందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.