Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న సినిమా 'పుష్ప'. ఇది వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా. అంతకుముందు 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలతో క్లాస్ గా వచ్చి ఇప్పుడు 'పుష్ప'

Pushpa : పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది.. సోలోగా వస్తున్న ఐకాన్ స్టార్

Pushpa

Pushpa :  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఇది వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా. అంతకుముందు ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలతో క్లాస్ గా వచ్చి ఇప్పుడు ‘పుష్ప’తో మాస్ గా రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇందులో నటి నటుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యి వైరల్ అయ్యాయి. ఈ సినిమా టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా నుంచి వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ అనే సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. వీటితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళం స్టార్ హీరో ఫాహిద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నాడు. కన్నడ హీరో ధనుంజయ్ కూడా స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న నిర్మాతలు : నట్టి కుమార్

ఈ సినిమా ని రెండు పార్టులుగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు ఆల్రెడీ చాలా పెద్ద సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటితో పాటు రిలీజ్ చేయడం కంటే సోలోగా వచ్చి భారీ కలెక్షన్లు సాధించి హిట్ కొట్టడం బెటర్ అని ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే ‘పుష్ప పార్ట్ 1’ రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ‘పుష్ప పార్ట్ 1’ విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. ఆ టైంలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో దగ్గర్లో క్రిస్స్మస్ కూడా ఉండటంతో సోలోగా వచ్చి హిట్ కొట్టే ప్లాన్ లో ఉన్నాడు అల్లు అర్జున్.