Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న నిర్మాతలు : నట్టి కుమార్

కొందరు నిర్మాతలు తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఇది అనేక అనుమానాలకు, వివాదాలకు దారి తీస్తుందని అన్నారు. పెద్ద నిర్మాతలు వాళ్ల సొంత ప్రయోజనాల కోసం డబుల్ గేమ్ ఆడుతున్నారని

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న నిర్మాతలు : నట్టి కుమార్

Natti

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి వివాదంపై చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో పెద్ద నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో చర్చించకుండా కొందరు నిర్మాతలు తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఇది అనేక అనుమానాలకు, వివాదాలకు దారి తీస్తుందని అన్నారు. పెద్ద నిర్మాతలు వాళ్ల సొంత ప్రయోజనాల కోసం డబుల్ గేమ్ ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు నట్టి కుమార్.

పవన్ కళ్యాణ్ మాకు బిగ్గెస్ట్ స్టార్ హీరో. ఆయన రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం మంచి విషయం. ఆయన వేరే పార్టీని తిట్టడం మాకు సంబంధం లేదు. కేవలం ఆయన సినిమా పరిశ్రమపై స్పందించినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు సినిమా పరిశ్రమ సమస్యలపై మాట్లాడే హక్కు ఉంది. ఆయనకు, ఇతర పార్టీకి ఉన్న విభేదాలు సినిమా పరిశ్రమకు సంబంధం లేదని అన్నారు.

BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..

నిన్న కొందరు అగ్ర నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలవడంపై నట్టి కుమార్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంతో కొందరు అగ్ర నిర్మాతలు జరుపుతున్న చర్చల గురించి పవన్ కళ్యాణ్ కి చెప్పలేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వల్లనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నదని పవన్‌కు నిర్మాతలు చెప్పి ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన తర్వాత అదే నిర్మాతలు అక్కడికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఇక్కడకు వచ్చి పవన్ కల్యాణ్‌తో కలిసి నవ్వుతూ ఫోటోలు దిగుతున్నారు అని వ్యాఖ్యానించారు.

ఏపీ మంత్రి పేర్ని నానిని కలసిన సినీ పెద్దలు అక్కడ ఏమి జరిగింది అనేది ఎవరికీ చెప్పకపోవడంతో అనేక సందేహాలు వస్తున్నాయి. ఇలా ఇక్కడ పవన్ తో సినిమా తేసే నిర్మాతలే అక్కడ ఏపీలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఇద్దరి దగ్గర వేర్వేరుగా మాట్లాడుతూ డబుల్ గేమ్ ఆడుతున్నారని నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పెద్దలు చిన్న నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా టికెట్లు అమ్మే విషయంపై చిన్న నిర్మాతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. ఛాంబర్, కౌన్సిల్‌కు సంబంధం లేకుండా ప్రభుత్వాలతో చర్చలు జరపడం చాలా తప్పు అని నట్టి కుమార్ విమర్శించారు.