BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..

ప్రతి సారి బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు బాగానే నడుస్తాయి. ఈ సారి ఇన్ని రోజులు అవుతున్నా కరెక్ట్ లవ్ స్టోరీ పడలేదు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. హౌస్ లో ఉన్న అమ్మాయిల్ని ఇంప్రెస్

BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..

Biggboss

BiggBoss :  ప్రతి సారి బిగ్ బాస్ లో లవ్ స్టోరీలు బాగానే నడుస్తాయి. ఈ సారి ఇన్ని రోజులు అవుతున్నా కరెక్ట్ లవ్ స్టోరీ పడలేదు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. హౌస్ లో ఉన్న అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలందరూ బాగానే ట్రై చేస్తున్నారు. గత ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ తో అందరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో హౌస్ లో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి అనుకున్నారు. కానీ రాత్రికి సీన్ మారిపోయింది.

Movies : రెండు పార్టులుగా వస్తున్న సినిమాలు..

కెప్టెన్సీ టాస్క్ విష‌యంపై కాజ‌ల్‌, శ్వేత మ‌ధ్య కాస్త హాట్ హాట్ డిస్క‌ష‌న్ న‌డిచింది. వీళ్లిద్దరికీ సపోర్ట్ చేస్తూ హౌస్ కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. రాత్రి అంద‌రు ప‌డుకున్నాక ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చూసుకొని శ్రీరామ్, హ‌మీదా ఇద్దరూ గాల్లోకి ముద్దులు పంపుకుంటూ గుడ్ నైట్ చెప్పుకున్నారు. దీంతో శ్రీరామ్ లోని రొమాంటిక్ యాంగిల్ బయటపడింది. ఇదిలా ఉంటే ముందే ప్రియాంక సింగ్ న‌ల్ల‌చీర‌లో వయ్యారంగా నడుస్తూ వచ్చింది. సింగ‌ర్ శ్రీరామ్ చంద్ర ప్రియాంక ని చూసి షాక్ అయి కాసేపు ఆమె వెనకాల తిరిగాడు. ప్రియాంక వెనకాల తిరగడమే కాకుండా ఓ మంచి పాట కూడా పాడుతూ తననే ఫాలో అయ్యాడు. పింకీ చాలా బాగున్నావ్ నువ్వు అని శ్రీరామ్ చెప్పడంతో ప్రియాంక సిగ్గుపడిపోయింది. దీంతో శ్రీరామ్ పింకీ ని ట్రై చేస్తున్నాడా, హమీదా ని ట్రై చేస్తున్నాడా లేక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నాడా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరి ఈ లవ్ స్టోరీ ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.