Movies : రెండు పార్టులుగా వస్తున్న సినిమాలు..

సినీ పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే దానికి రెండవ పార్ట్ గా అదే పేరుతో ఇంకో సినిమా తీసేవారు. ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని

Movies : రెండు పార్టులుగా వస్తున్న సినిమాలు..

Kgf

Movies :  సినీ పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే దానికి రెండవ పార్ట్ గా అదే పేరుతో ఇంకో సినిమా తీసేవారు. ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ గా పార్ట్ 2లు వస్తాయి. కొన్ని అదే స్టోరీని కంటిన్యూ చేస్తూ సిరీస్ లా పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తాయి. కానీ వీటిలో సక్సెస్ రేట్ తక్కువే. మొదట్లో సినిమా నిడివి దాదాపు 3 గంటల వరకు ఉండేది. తర్వాత అది 2 గంటల ౩౦ నిమిషాలకు కుదించారు. ఆ తర్వాత 2 గంటల్లోనే సినిమాని ముగిస్తున్నారు. ఇటీవల 2 గంటలు అంతకంటే తక్కువ నిడివి ఉన్న సినిమాలు వస్తున్నాయి. కానీ కొన్ని కథలు 2 లేదా 3 గంటల్లో చెప్పడం కుదరదు. వాటికి 3 గంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది. అంత సేపు ప్రేక్షకులు కూర్చొని సినిమా చూడలేరు. అందుకే ఇటీవల కొన్ని సినిమాలని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ లాభం కూడా వస్తుంది.

రెండు పార్టులు కలిపి ఒకే కథ ఉంటుంది. కొన్ని సినిమాలైతే షూటింగ్ కూడా ఒకేసారి పూర్తి చేసేసి తర్వాత దాన్ని రెండు సినిమాలుగా విడుదల చేస్తున్నారు. ఇలా ఒకే కంటిన్యూ కథతో తెలుగులో ‘బాహుబలి’ సినిమాతో ఈ పద్ధతి మొదలైంది. బాహుబలి 1, 2 రెండు పార్టులు కూడా భారీ విజయం సాధించాయి. ఇక కన్నడలో యష్ నటించిన ‘కెజిఎఫ్’ కూడా పార్ట్ 1 రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. థియేటర్లు పూర్తిగా తెరిస్తే పార్ట్ 2 కూడా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాని కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రెండు పార్టుల షూటింగ్ ఒకేసారి చేసేస్తున్నారు. తమిళ్ లో మణిరత్నం తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కూడా రెండు పార్టులుగా రిలీజ్ అవ్వనుంది. అలాగే లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా కూడా రెండు పార్టులుగానే రిలీజ్ చేస్తారని సమాచారం.

Babu Mohan : పవన్, పోసాని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.. బాబు మోహన్ ఫైర్

ఇలా ఒక సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు. దీని వల్ల ఒక పెద్ద కథని జనాలకి కరెక్ట్ గా చెప్పగలం, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సినీ పరిశ్రమ లోపల, బయట ఇండస్ట్రీపై ఆధారపడి జీవించే వాళ్లకి ఎక్కువ రోజులు పని దొరుకుతుంది. ఇలా వచ్చిన సినిమాలు సక్సెస్ కూడా అవుతూ ఉండటంతో భవిష్యత్తులో ఇలా చాలా సినిమాలు రావొచ్చు.