Pushpa : ‘పుష్ప’ వన్ మ్యాన్ షో.. బెనిఫిట్ షో ఫ్యాన్స్ రివ్యూ ఇదే..

'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడు అంటున్నారు. అలాగే యాక్షన్ సీన్లు అదిరిపోయాయని, ఈ యాక్షన్ సీన్స్ లో బన్నీ ఇరగదీశాడని చెప్తున్నారు. బన్నీ చేసిన యాక్టింగ్ కి......

Pushpa : ‘పుష్ప’ వన్ మ్యాన్ షో.. బెనిఫిట్ షో ఫ్యాన్స్ రివ్యూ ఇదే..

Pushpa (1)

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. వీరిద్దరి కాంబినేష లో వచ్చిన మూడో సినిమా కూడా హిట్ అయి హ్యాట్రిక్ గా నిలిచింది అని సినిమా చూసిన అభిమానులు చెప్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి ముందు నుంచి అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇక సాంగ్స్ అన్ని హిట్ కావడం, టీజర్ , ట్రైలర్ లు కూడా బాగా వైరల్ అవ్వడంతో సినిమాపై మరిన్ని అంచానాలు పెరిగాయి. ఇవాళ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. ఆల్రెడీ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు, అమెరికాలో ఆల్రెడీ షోలు పడటంతో అభిమానులు ఈ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేస్తున్నారు.

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడు అంటున్నారు. అలాగే యాక్షన్ సీన్లు అదిరిపోయాయని, ఈ యాక్షన్ సీన్స్ లో బన్నీ ఇరగదీశాడని చెప్తున్నారు. బన్నీ చేసిన యాక్టింగ్ కి ఆయన తప్ప సినిమాలో ఎవరూ కనిపించలేదని అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ యాక్టింగ్ తో పాటు చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుందని అంటున్నారు అభిమానులు. ‘పుష్ప’ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ ఓ రేంజ్ లో ఉందని, బన్నీ ఎలివేషన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని, అడవుల్లో చేసిన ఫైట్ చాలా స్పెషల్ అని, ఆ ఫారెస్ట్ ఫైట్‌కు పొర్లు దండాలు పెట్టొచ్చని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Sumanth : చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకి హీరో సుమంత్, సుప్రియ

సమంత చేసిన స్పెషల్ సాంగ్ విజువల్స్ బాగున్నాయని, బన్నీ ఎప్పటిలాగే డ్యాన్స్ తో, కొత్త కొత్త స్టెప్స్ తో కూడా అదరగొట్టారని అంటున్నారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ పాటలో ఉందని, అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ సీన్స్ సూపర్ అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సెకాండఫ్‌లో ఎంట్రీ ఇచ్చాడని తెలిపారు. మొత్తానికి ‘పుష్ప’ బన్నీ వన్ మ్యాన్ షో అని ఈ సినిమాతో సుకుమార్ తో కలిపి హ్యాట్రిక్ కొట్టాడని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు