Pushpa2: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి పుష్ప.. తగ్గేదే లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కేవలం రీజనల్ మూవీగా మాత్రమే రిలీజ్ అయిన ఈ....

Pushpa2: బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి పుష్ప.. తగ్గేదే లే!

Pushpa2 Will Be The Biggest Pan India Movie

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కేవలం రీజనల్ మూవీగా మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేసి వదిలారు. అయినా కూడా స్టైలిష్ స్టార్ మేనరిజం, సుకుమార్ టేకింగ్‌లకు ఇతర భాషల ఆడియెన్స్ ఫిదా అయిపోయి, అక్కడ కూడా ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించారు. దీంతో ఈసారి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేందుకు రెడీ అవుతున్నాడు పుష్పరాజ్.

Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?

ఇప్పటివరకు ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలుగా ఉన్న బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను దాటేందుకు పుష్ప పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టును ఇప్పటికే ఫైనల్ చేసిన బన్నీ, సుకుమార్‌లు ఎలాంటి మిస్టేక్ జరగకుండా చాలా జాగ్రత్తపడుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్న చిత్ర యూనిట్, ఈ సినిమా బడ్జెట్ విషయంలో కానీ, క్యాస్టింగ్ విషయంలో కానీ ఏమాత్రం వెనకడుగు వేయకూడదని ఫిక్స్ అయ్యింది. దీంతో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!

ఇప్పటికే ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని మరో విలన్ పాత్ర కోసం తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక, ఈసారి సీక్వెల్ కథను ముందుగా అనుకున్నదానికంటే కూడా చాలా పవర్‌ఫుల్‌గా రాసిపెట్టుకున్నారట దర్శకుడు సుకుమార్. 2023లో రిలీజ్ కానున్న ‘పుష్ప-ది రూల్’ బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలను మించిన పాన్ ఇండియా మూవీగా రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను తీర్చిదిద్దడం మొదలుకొని, ప్రమోషన్స్ వరకు అన్నీ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. మరి నిజంగానే పుష్పరాజ్ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను దాటేస్తాడా అనేది తెలియాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే.