Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. మార్చి 11న రాధే శ్యామ్ రిలీజ్ కానుండగా రెబల్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్..

Radhe Shyam: ఫస్ట్ రివ్యూ.. ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’!

Radhe Shyam

Radhe Shyam: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. మార్చి 11న రాధే శ్యామ్ రిలీజ్ కానుండగా రెబల్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా యూనిట్ కూడా మరోసారి ప్రమోషన్ మొదలు పెట్టింది. సాంగ్స్ నుండి మరోసారి రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేసిన యూనిట్ దేశవ్యాప్తంగా ఈవెంట్లు, మీటింగ్స్ అంటూ సందడి చేస్తుంది.

Radhe Shyam: పేరుకే డార్లింగ్.. కానీ రొమాన్స్ మాత్రం కష్టం!

వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్లకుపైగా రిలీజ్ కానున్న రాధేశ్యామ్ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుండగా.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడితో పాటు యూనిట్ సినిమా గురించి ఇలా అని అని చెప్పుకురావడం.. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండడం ప్రభాస్ అభిమానులకు తెగ కిక్కిస్తుంది. కాగా.. ఇప్పుడు రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. తనకు తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబరుగా చెప్పుకునే ఉమైర్ సంధు మన సినిమాల గురించి రివ్యూలు ఇచ్చే సంగతి తెలిసిందే.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. రాధేశ్యామ్ క్లైమాక్స్ రచ్చ!

అలాగే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా గురించి ఉమైర్ సంధు ట్విట్టర్ రివ్యూ ఇచ్చారు. రాధేశ్యామ్ సినిమా చూశానని చెప్పిన ఉమైర్.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉందని.. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించినట్లు పేర్కొన్నారు. కథను యూనిక్ సబ్జెక్టుగా పేర్కొన్న అతడు, సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని పేర్కొన్నాడు. మూవీలో ప్రభాస్ డ్రెస్సింగ్.. యాక్టింగ్ అద్భుతమని.. భారత్ లో ప్రభాస్ క్లాస్.. స్టైల్ ను బీట్ చేసే వారు ఎవరూ లేరన్న ఉమైర్ ఈ సినిమాను ‘క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా పేర్కొన్నారు.