Radhe Shyam: ఇంగ్లీష్‌లో రాధేశ్యామ్ టీజర్.. గ్లోబల్ ప్రమోషన్ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ రొటీనైపోయింది. పాన్ వరల్డ్ స్టార్ పాతదైపోయింది. అందుకే రెబల్ స్టార్ కాస్తా గ్లోబర్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని రాధేశ్యామ్ టీజర్..

Radhe Shyam: ఇంగ్లీష్‌లో రాధేశ్యామ్ టీజర్.. గ్లోబల్ ప్రమోషన్ స్టార్ట్!

Radhe Shyam

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ రొటీనైపోయింది. పాన్ వరల్డ్ స్టార్ పాతదైపోయింది. అందుకే రెబల్ స్టార్ కాస్తా గ్లోబర్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని రాధేశ్యామ్ టీజర్ అనౌన్స్ మెంట్ తో మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ ని ఇంగ్లీష్ లో రిలీజ్ చేసేంత గ్లోబల్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!

తెలుగులో ఇప్పటి వరకూ ఎవరూ చెయ్యని సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లి.. టాలీవుడ్ సత్తా చూపించిన ప్రభాస్.. ఇప్పుడు ఈ క్రేజ్ ని వరల్డ్ వైడ్ గా పెంచుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ ని ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు ప్రభాస్.

Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈసినిమా టీజర్ ని అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. రాధేశ్యామ్ లో విక్రమాధిత్య క్యారెక్టర్ చేస్తున్న ప్రభాస్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు.

Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?

ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ సెపరేట్ గా టీజర్స్ రిలీజ్ చేసుకుంటున్నాయి. కానీ రీచబిలిటీ కోసం గ్లోబల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా రాధేశ్యామ్ ని రిలీజ్ చేస్తున్న టీమ్.. టీజర్ తోనే గ్లోబల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాయి. ఇప్పటి వరకూ యష్ మాత్రమే కెజిఎఫ్ టీజర్స్ ని ఇంగ్లీష్ లో రిలీజ్ చేసి సినిమా మీద ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైమ్.. ప్రభాస్ ఇంగ్లీష్ లో టీజర్ ని రిలీజ్ చేస్తూ.. సినిమా మీద హైప్స్ ని ఇంకా ఎక్స్ ట్రీమ్ కి తీసుకెళ్లారు.