Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!

ఒక్క బ్రేక్ దక్కించుకుని.. ఒక్క హిట్టు కొడితే తలరాతే మారిపోతుంది. అందుకు ఉదాహరణ విజయ్ దేవరకొండ లాంటి హీరోలే. అందుకే అలాంటి బ్రేక్ కోసం అప్ కమింగ్ హీరోలతో పాటు...

Telugu Young Hero’s: ఒక్క బ్రేక్.. ఒక్క హిట్టు కావాలి ప్లీజ్!

Telugu Young Hero's

Telugu Young Hero’s: ఒక్క బ్రేక్ దక్కించుకుని.. ఒక్క హిట్టు కొడితే తలరాతే మారిపోతుంది. అందుకు ఉదాహరణ విజయ్ దేవరకొండ లాంటి హీరోలే. అందుకే అలాంటి బ్రేక్ కోసం అప్ కమింగ్ హీరోలతో పాటు.. ఎస్టాబ్లిష్ అవుదామని తెగ ట్రై చేస్తున్న హీరోలు తెగ తాపత్రయపడుతున్నారు. ఈ సారి సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సినిమాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ రాక ఒక్క బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుని రెడీ అయ్యారు.

sankranti 2022: ఇప్పటికే టఫ్‌ఫైట్.. అయినా బంగార్రాజు సై?

అప్ కమింగ్ హీరోలు హిట్ కోసం ట్రై చేస్తున్నారు. అందుకే ఈ సారి మరిన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకురాబోతున్నారు. లేటెస్ట్ గా కార్తికేయ తన అప్ కమింగ్ మూవీ రాజావిక్రమార్కకు సంబందించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శ్రీసరిపల్లి డైరెక్షన్లో తాన్య హీరోయిన్ గా చేస్తున్న ఈ కాప్ యాక్షన్ స్టోరీ రాజా విక్రమార్క నవంబర్ 12న రిలీజ్ అవుతోంది.

Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ డైరెక్షన్లో రొమాంటిక్ మూవీ తెరకెక్కింది. హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామనుకుంటున్న ఆకాష్ కి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాన్ ఇండియా ప్రభాస్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా మీద ఎక్స్ పెక్టే షన్స్ పెరిగిపోయాయి. మంచి హైప్స్ తో సినిమా అక్టోబర్ 29న రిలీజ్ అవుతోంది.

Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!

వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు నాగశౌర్య. ఈ హీరో కూడా లక్ష్య, వరుడు కావలెను సినిమాల్ని బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేస్తున్నాడు. రీతూవర్మ హీరోయిన్ గా వరుడుకావలెను అక్టోబర్ 29న రిలీజ్ చేస్తుంటే.. నవంబర్ 12న లక్ష్యతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. మరి ఈ సారైనా ఈ హీరోలకు బ్రేక్ దక్కేనో లేదో చూడాలి.