Radhe Shyam: హైదరాబాద్‌లోనే రాధేశ్యామ్ నేషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

త్వరలో రాబోతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఒక దానికి మించి మరొకటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా కోసం మన ప్రేక్షకులే కాదు..

Radhe Shyam: హైదరాబాద్‌లోనే రాధేశ్యామ్ నేషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

Radhe Shyam

Radhe Shyam: త్వరలో రాబోతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయి సినిమాలే. ఒక దానికి మించి మరొకటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా కోసం మన ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మన మేకర్స్ కూడా దేశంలోని అన్ని నగరాలను చుట్టేస్తూ అంతటా సినిమాకి ప్రమోషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్ కూడా మొదలైన సంగతి తెలిసిందే.

BBTeluguGrandFinale: సరయూతో నాగ్ డేట్.. ఐ డోంట్ కేర్ జనాలన్న మన్మథుడు!

ఆర్ఆర్ఆర్ నార్త్ టూ సౌత్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేయగా ముందుగా ఈ ఆదివారం ముంబైలో కనీవినీ ఎరుగని రీతిలో ఈవెంట్ ప్లాన్ చేసింది. సంక్రాంతికి రాబోతున్న మరో పాన్ ఇండియా సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్. ఇప్పటికే రాధేశ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవగా త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే రాధేశ్యామ్ దేశంలోని నగరాలలో విడివిడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేసే కన్నా సౌత్ అన్ని బాషలకు కలిపి ఒకచోట.. నార్త్ లోమరొక చోట ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

Hero’s Gifts To Unit: సినిమా ప్రేమ.. గిఫ్ట్స్ ఇచ్చి ఇంప్రెస్ చేస్తున్న హీరోలు!

ఇందుకు గాను ముందుగా సౌత్ బాషలకు సంబంధించి హైదరాబాద్ లోనే నేషనల్ స్థాయిలో ఓ ఈవెంట్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక కోసం స్పెషల్ సెట్ సిద్ధం చేస్తుండగా.. ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇలా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నేషనల్ స్థాయిలో అరేంజిమెంట్స్ చేయడం ఇదే తొలిసారి. ఈ నేషనల్ ఈవెంట్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొనగా ఈ వేడుక కోసం వివిధ బాషల నుండి గెస్టులుగా ఎవరొస్తారన్నది ఆసక్తిగా మారింది.