BBTeluguGrandFinale: సరయూతో నాగ్ డేట్.. ఐ డోంట్ కేర్ జనాలన్న మన్మథుడు!

బిగ్ బాస్ ఈ సీజన్ ఫినాలే షో నిర్వాహకులు మామూలుగా ప్లాన్ చేయలేదు. ఇంతకు ముందు నాలుగు సీజన్లను తలదన్నేలా.. ఈ సీజన్ మొత్తం మీద పోయిన టీఆర్పీలను ఒక్క ఎపిసోడ్ తో కొట్టేసేలా ప్లాం చేశారు

BBTeluguGrandFinale: సరయూతో నాగ్ డేట్.. ఐ డోంట్ కేర్ జనాలన్న మన్మథుడు!

Bbtelugugrandfinale (1)

BBTeluguGrandFinale: బిగ్ బాస్ ఈ సీజన్ ఫినాలే షో నిర్వాహకులు మామూలుగా ప్లాన్ చేయలేదు. ఇంతకు ముందు నాలుగు సీజన్లను తలదన్నేలా.. ఈ సీజన్ మొత్తం మీద పోయిన టీఆర్పీలను ఒక్క ఎపిసోడ్ తో కొట్టేసేలా ప్లాం చేశారు. ఒక్కరు కాదు ఇద్దరు డజను మందికి పైగా స్టార్స్ ను ఈ ఫినాలే ఎపిసోడ్ కోసం తీసుకొచ్చాడు. స్టార్స్ ను తీసుకురావడమే కాదు వారితో ఎంత ఎంటర్ టైన్మెంట్ కావాలో అంతా పిండేసుకున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు హల్చల్ చేస్తూ షో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేలా చేశారు.

BBTeluguGrandFinale: ఐ లవ్ యూ చెప్పిన అలియా.. కిందపడిపోయిన సన్నీ!

ఈ ప్రోమోలలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బిగ్ బాస్ ఈ సీజన్ కంటెస్టెంట్ సన్నీకి ఐ లవ్ యూ చెప్పడం విశేషం. అది కూడా అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ పక్కనే ఉండగా అలియాతో లవ్ యూ చెప్పించేశాడు. సరదాగా చేసినా అదే పెద్ద వండర్ అనుకుంటే సరయూతో నాగార్జునను డేట్ కి ఒప్పించాడు. బిగ్ బాస్ స్టేజ్ మీద వరసగా మాట్లాడుతున్న సెలబ్రిటీల నుండి డబుల్ ధమాకా సందడి చేయించినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద మాట్లాడుతున్న సరయూ సడన్ గా నాగార్జునతో డేట్ కావాలని అడిగేసింది.

Bollywood Star’s controversy: సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు!

దానికి నాగ్ కూడా బిగ్ బాస్ ఫినాలే ముగియగానే ఇటు నుండే ఇటే మనం వెళ్ళిపోదాం సరయూ అని చెప్పేశాడు. ఐ డోంట్ కేర్ జనాలు.. చేయాలనుకున్నది చేసేయడమే అంటూ నాగ్ నోటి నుండి రావడంతో సరయూ కేకలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొత్తం ప్రోమోలు చూస్తుంటే ఈ గ్రాండ్ ఫినాలే రచ్చ మామూలుగా ఉండేలా లేదు. ఇక, బిగ్ బాస్ ప్రేక్షకులలో మాత్రం ఈ సీజన్ విన్నర్ ఎవరా అన్న ఆతృత మాత్రం గంటగంటకు పెరిగిపోతూ ఉంది. మరి విన్నర్ ఎవరో.. ఈ ధమాకా ఎంటర్ టైన్మెంట్ ఏంటో షో మొదలైతే కానీ తెలియదు.