Bollywood Star’s controversy: సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు!

టాలీవుడ్ స్టార్లే కాదు .. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎప్పుడూ ఏదోక విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. లేటెస్ట్ గా ఇలాగే సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్నారు.

Bollywood Star’s controversy: సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు!

Bollywood Star's Controversy

Bollywood Star’s controversy: టాలీవుడ్ స్టార్లే కాదు .. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎప్పుడూ ఏదోక విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. లేటెస్ట్ గా ఇలాగే సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్నారు బాలీవుడ్ స్టార్లు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ అవుతున్నాడు. ఎప్పుడూ తన డ్రెస్సింగ్ స్టైల్ తో వార్తల్లో నిలిచే రణ్ వీర్ సింగ్ ఈ సారి ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యారు. లేటెస్ట్ గా తన అప్ కమింగ్ మూవీ 83కి సంబందించి ప్రమోషన్ కోసం దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఈవెంట్ కి గోల్డ్ కలర్ డ్రెస్ లో కనిపించి షాకిచ్చారు రణవీర్. మరోసారి దీపికా డ్రెస్ వేసుకున్నావా, జూనియర్ బప్పీలహరిలా ఉన్నావు అంటూ క్రేజీ క్రేజీ కామెంట్స్ తో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్.

Sophie Choudry: మాల్దీవులకే మెంటలెక్కిస్తున్న సోఫీ చౌదరి!

ఇక స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ని కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అసలే బాలీవుడ్ లో కోవిడ్ స్పీడప్ అవుతుండడంతో కోవిడ్ ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే నని, 15 రోజులు సెల్ఫ్ క్వారంటీన్ లో ఉండాల్సిందే అంటూ బిఎమ్సీ స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది. కానీ ఆలియా అవేం పట్టించుకోకుండా డిల్లీలో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కి అటెండ్ అవ్వడంతో ఫుల్ ఫైర్ అయ్యింది బిఎమ్సీ. ఈ ఇష్యూలో సీరియస్ అయిన అఫీషియల్స్ ఆలియా భట్ కి సమన్లు కూడా ఇష్యూ చేసింది.

Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

మరో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా పెద్ద కాంటవర్సీ ఫేస్ చేస్తోంది. ఆర్దిక నేరాలతో అరెస్టయిన సుఖేష్ తో క్లోజ్ రిలేషన్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి. ఈ ఇష్యూతో పాటు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి సమన్లు కూడా అందుకుంది జాక్విలిన్. దాంతో ఈ కాంట్రవర్సీతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది ఈ శ్రీలంక బ్యూటీ జాక్విలిన్.