BBTeluguGrandFinale: ఐ లవ్ యూ చెప్పిన అలియా.. కిందపడిపోయిన సన్నీ!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 ఫైనల్స్ కు వచ్చేసింది. ఈ ఆదివారంతో ఈ సీజన్ విజేత ఎవరో.. ప్రైజ్ మనీ ఎవరిదో కూడా తేలిపోనుంది. ఈ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మరింత..

BBTeluguGrandFinale: ఐ లవ్ యూ చెప్పిన అలియా.. కిందపడిపోయిన సన్నీ!

Bbtelugugrandfinale

BBTeluguGrandFinale: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 ఫైనల్స్ కు వచ్చేసింది. ఈ ఆదివారంతో ఈ సీజన్ విజేత ఎవరో.. ప్రైజ్ మనీ ఎవరిదో కూడా తేలిపోనుంది. ఈ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ స్టేజ్ మరింత గ్రాండ్‌గా ముస్తాబయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్‌ప్రైజ్‌లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్స్‌ని రంగంలోకి దించారు. ఈ ఎపిసోడ్ లో ఒక్కొకరుగా స్టార్స్ తో మొదలై వరుస గెస్ట్‌లతో స్టేజ్‌ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Bollywood Star’s controversy: సోషల్ మీడియాలో రోస్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్లు!

బాలీవుడ్‌ లవ్లీ కపుల్, ‘బ్రహ్మస్త్ర’ టీం నుంచి రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి రాజమౌళి, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ నుంచి నాని, కృతిశెట్టి, సాయి పల్లవి, ‘పరంపర’ టీం నుంచి జగపతి బాబు, నవీన్‌చంద్ర, పుష్ప నుంచి సుకుమార్‌, దేవీశ్రీ ప్రసాద్‌, రష్మికలతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ లతో పాటు శ్రేయశరన్, మరికొందరు సినీ స్టార్స్ స్పెషల్ డాన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లిపోనుంది. మొత్తం బిగ్ బాస్ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

Tollywood Star’s controversy: సక్సెస్ తోడు వివాదాలు.. హాట్ టాపిక్ అవుతున్న స్టార్స్!

ఈ ఎపిసోడ్ లో స్టేజ్ మీదకి వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ బిగ్ బాస్ ఫైనలిస్ట్ సన్నీకి ఐ లవ్ యూ చెప్పడం విశేషం. కాగా, అలియా లవ్ యూ చెప్పడంతో సన్నీ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అసలే క్రేజీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ హీరోయిన్ తనకు ఐ లవ్ యూ చెప్పడమా.. ఇది కలా.. నిజమా.. అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడు. మొత్తానికి తనకు ఎంతో ఇష్టమైన బాలీవుడ్‌ హీరోయిన్‌తో ఐ లవ్‌యూ చెప్పించుకున్న సన్నీ ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.