Chandramukhi 2 : దాదాపు 22 ఏళ్ళ తరువాత కీరవాణి తమిళ్ ఎంట్రీ.. చంద్రముఖి 2 షూటింగ్ చివరి దశలో..

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వస్తున్న చంద్రముఖి 2 కి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ అండ్..

Chandramukhi 2 : దాదాపు 22 ఏళ్ళ తరువాత కీరవాణి తమిళ్ ఎంట్రీ.. చంద్రముఖి 2 షూటింగ్ చివరి దశలో..

Raghava Lawrence Kangana Ranaut Chandramukhi 2 shooting and Keeravani music

M M Keeravani Music for Chandramukhi 2 : రజినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో వచ్చిన హారర్ మూవీ ‘చంద్రముఖి’. ఈ సినిమా హారర్ చిత్రాలకు ఒక ఐకాన్ అయ్యింది. ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించి అందర్నీ బయపెట్టేసింది. 18 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు మేకర్స్. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా, బాలీవుడ్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut) చంద్రముఖి పాత్రలో ఈ సినిమా రాబోతుంది. చంద్రముఖిని డైరెక్ట్ చేసిన పి వాసు ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

Game Changer : నవీన్ చంద్ర తల్లితో డైరెక్టర్ శంకర్ ముచ్చట్లు.. రామ్‌చరణ్‌కి థాంక్యూ చెబుతూ ఫోటోలు షేర్..

ఇక కొన్ని నెలల క్రిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు. చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని, ఇంకో 10 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలియజేశాడు. ఆ షెడ్యూల్ మైసూర్ లో జరగనుందని కూడా వెల్లడించాడు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 22 ఏళ్ళ తరువాత కీరవాణి తమిళంలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Ram Pothineni : బొంగులో నా లిమిట్స్.. రామ్ బోయపాటి మాస్ రచ్చ..

2001 లో తెలుగు చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 సినిమాని తమిళంలో రీమేక్ చేయగా.. తెలుగు మూవీకి సంగీతం అందించిన కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారు మేకర్స్. ఆ సినిమా తరువాత మరో స్ట్రెయిట్ తమిళ్ ఫిలిం చేయలేదు కీరవాణి. ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు చంద్రముఖి 2 తో మళ్ళీ స్ట్రెయిట్ మూవీ చేస్తూ తమిళంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా చంద్రముఖి 3 కూడా ఉండబోతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే.