Game Changer : నవీన్ చంద్ర తల్లితో డైరెక్టర్ శంకర్ ముచ్చట్లు.. రామ్‌చరణ్‌కి థాంక్యూ చెబుతూ ఫోటోలు షేర్..
నవీన్ చంద్ర రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఆ మూవీ సెట్స్ లోని పిక్స్ ని షేర్ చేస్తూ..

Naveen Chandra shares Ram Charan Game Changer movie sets pics
Ram Charan Game Changer : రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చెంజర్. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) చరణ్ కి జోడిగా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నవీన్ చంద్ర ఈ సినిమా సెట్స్ లోని కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న (మే 14) మదర్స్ డే కావడంతో తన తల్లికి విషెస్ చెబుతూ ఆ పోస్ట్ చేశాడు.
Ram Charan fans : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని చితక్కొట్టిన చరణ్ ఫ్యాన్స్..
“నా స్కూల్ డేస్ సమయంలో నేను సాధించిన విజయాల్ని నీకు చూపించడానికి నేను ఎదురు చూసేవాడిని. ఇక అదే సమయంలో నువ్వు నన్ను జెంటిల్ మెన్ సినిమాకి తీసుకు వెళ్లిన సంగతి ఇంకా గుర్తు ఉంది. ఆ సినిమాలో ప్రభుదేవా వేసిన స్టెప్స్ చూపిస్తూ, ఆయన మన ఇండియన్ మైఖెల్ జాక్సన్ అని చెప్పడం కూడా గుర్తుంది. ఆ మాటలు నా పై చాలా ప్రభావం చూపించాయి. ఇప్పుడు నువ్వు శంకర్ సార్ తో కలిసి మాట్లాడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. గేమ్ చెంజర్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు నువ్వు వారందిరికి కృతజ్ఞతలు కూడా చెప్పావు. ఇక రామ్ చరణ్ గారు టైం తీసుకోని మరి మా అమ్మతో మాట్లాడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అందుకు ఆయనకి థాంక్యూ. నాకు ఇంతటి మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చినందుకు అందరికి థాంక్యూ” అంటూ పోస్ట్ చేశాడు.
Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా ఇటీవలే ఈ మూవీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
View this post on Instagram