Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం. ఉత్తర గోవాలోని మపుసా పట్టణంలోని డాగ్ కెన్నెల్ నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లలను రాహుల్ కొనుగోలు చేశారు....

Rahul Gandhi : రాహుల్ గాంధీకి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం.. గోవా నుంచి ఢిల్లీకి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్కపిల్లలు

Rahul Gandhi With Puppy

Rahul Gandhi With Puppy : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టం. ఉత్తర గోవాలోని మపుసా పట్టణంలోని డాగ్ కెన్నెల్ నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లలను రాహుల్ కొనుగోలు చేశారు. (Rahul Gandhi With Puppy) గోవాకు చెందిన శివాని పిత్రే తన భర్త స్టాన్లీ బ్రగాన్కాతో కలిసి డాగ్ కెన్నెల్ నడుపుతున్నారు.

US Navy Men : చైనాకు రహస్య సమాచారం అందించిన యూఎస్ నేవీ సిబ్బంది..అరెస్ట్

కుక్క పిల్లలపై అమితమైన ప్రేమ చూపే రాహుల్ గాంధీ జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లల గురించి ఆరా తీయడానికి ముందుగా తన ప్రతినిధిని పంపించారు. (Jack Russell Terrier Puppy From Goa) అనంతరం జాక్ రస్సెల్ టెర్రియర్ కుక్క పిల్లలను ఢిల్లీకి తీసుకువెళ్లే ముందు తానే స్వయంగా వ్యక్తిగత పర్యటనపై గోవా వచ్చారు. గురువారం ఉత్తర గోవాలోని మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మపుసాలోని డాగ్ కెన్నెల్ వద్దకు వచ్చారు.

Mexico : మెక్సికోలో లోయలో పడిన బస్సు…17 మంది మృతి,22 మందికి గాయాలు

రాహుల్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరే ముందు కొద్దిసేపు కెన్నెల్‌లో కుక్క పిల్లలతో గడిపారని పిత్రే చెప్పారు. రాహుల్ అత్యంత నిరాడంబరుడని కాంగ్రెస్ నాయకుడొకరు పేర్కొన్నారు. డాగ్ కెన్నెల్ లో కుక్కపిల్లలతో కలిసి రాహుల్ గాంధీ ఆడుకున్నారని నిర్వాహకులు చెప్పారు.బుధవారం రాత్రి ఒక హోటల్‌లో గోవా ఎమ్మెల్యేలు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమిత్ పాట్కర్‌తో సహా కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఒక కుక్కపిల్లతో విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. (Rahul Gandhi Returns To Delhi With Jack Russell Terrier Puppy) రాహుల్ మరో కుక్కపిల్లని ఎంచుకున్నాడని, దాన్ని తర్వాత ఢిల్లీకి పంపుతామని డాగ్ కెన్నెల్ నిర్వాహకులు చెప్పారు.