Chiyaan Vikram : విలన్‌గా విక్రమ్!..

క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్న రాజమౌళి..

Chiyaan Vikram : విలన్‌గా విక్రమ్!..

Chiyaan Vikram

Chiyaan Vikram: దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ వంటి అప్‌డేట్స్, దుబాయ్‌లో ఏర్పాటు చెయ్యబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ వంటి హడావిడిలో ఉన్నారు.

Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయ్యింది.

RRR Movie : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

మహేష్ – రాజమౌళి సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ కోసం వెర్సటైల్ యాక్టర్ ‘చియాన్’ విక్రమ్‌ని జక్కన్న కలిసి కథ చెప్పారట. విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

9 Nelalu

 

‘9 నెలలు’ సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగు మూవీ చెయ్యని విక్రమ్, మహేష్ – రాజమౌళి సినిమాతో ఆ కోరిక తీర్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’, ‘ధృవనక్షత్రం’, ‘మహాన్’, ‘పొన్నియిన్ సెల్వన్ – పార్ట్ 1’, ‘మహావీర్ కర్ణ’ సినిమాలు చేస్తున్నారు.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..