Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

విశ్వనటుడు కమల్ హాసన్ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు..

Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

Kamal Haasan

Updated On : November 22, 2021 / 3:26 PM IST

Kamal Haasan: ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటుంటే.. మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తుంది. రీసెంట్‌గా విశ్వనటుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

Ajay Devgn : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

ఇటీవల అమెరికా వెళ్లిన కమల్ తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహాలు పాటిస్తూ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందవద్దని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానని కమల్ ట్వీట్ చేశారు.

VIKRAM Movie : ‘విక్రమ్’ గా కమల్ ‘విశ్వరూపం’..

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’, ‘ఖైది’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమాలు చేస్తున్నారు కమల్ హాసన్. కరోనా బారినపడ్డ కమల్ త్వరగా కోలుకోవాలంటూ కోలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు, అభిమానులు పోస్టులు చేస్తున్నారు.