Rajamouli: జక్కన్న క్రేజీ థాట్.. రజనీ-కమల్ తో మల్టీస్టారర్ సినిమా!

తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల..

Rajamouli: జక్కన్న క్రేజీ థాట్.. రజనీ-కమల్ తో మల్టీస్టారర్ సినిమా!

Rajamouli

Rajamouli: తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ఎవరంటే అన్ డౌటెడ్ గా రాజమౌళి అనే అంటారు అందరూ. బాహుబలితో వచ్చిన క్రేజ్ అక్కడే ఆగిపోకుండా ఇంకా ఇంకా తెలుగు సినిమాని ప్రమోట్ చేసేస్తున్నాడు. ఆయన సినిమాకే ఆయన కష్టపడి ప్రమోట్ చేసుకున్నా బయట అది ముందు తెలుగు సినిమాగానే ప్రమోట్ అవుతుంది.

Rajamouli: బాహుబలి-3 కూడా ఉంటుంది.. జక్కన్న క్లారిటీ

రాజమౌళి సినిమాలో పనిచేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటే.. రాజమౌళి సినిమా వస్తుంది.. ఓ రెండు వారాలు మన సినిమాలు పక్కకి తప్పుకుంటే బెటర్ అని బాలీవుడ్ నిర్మాతలు కూడా చేతులెత్తేసే స్థాయికి రాజమౌళి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి నుండి ఏ అప్డేట్ వినిపిస్తుందా.. ఆయన థాట్ ఏవిధంగా ఉందా అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Mahesh-Rajamouli: జక్కన్న లెక్క.. మహేష్ సినిమా వచ్చే ఏడాదేనా?

అలాంటి రాజమౌళి సౌత్ సూపర్ స్టార్స్ రజినీకాంత్-కమల్ హాసన్ తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న జక్కన్నకు ఓ ఇంటర్వూలో మీరు తమిళ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రం చేస్తే ఎవరితో చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆయన.. కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. ఒకవేల రజిని విలన్‌గా కమల్ హీరోగా ఉన్నా పరవాలేదు. ఇది చాలా సార్లు నా మైండ్‌లో మెదులుతుంటుంది. పూర్తి కథ లేదు కానీ అలా వారిద్దరిని చూడాలని ఓ అభిమానిగా వారితో అలాంటి సినిమా చేయ్యాలని ఉందన్నాడు జక్కన్న. మరి దీనిపై ఆ హీరోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.