Mahesh-Rajamouli: జక్కన్న లెక్క.. మహేష్ సినిమా వచ్చే ఏడాదేనా?

సూపర్ స్టార్ తో జక్కన్న పట్టాలెక్కేది ఎప్పుడన్న ప్రశ్నపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. 2022లో మాత్రం అది జరిగేలా..

Mahesh-Rajamouli: జక్కన్న లెక్క.. మహేష్ సినిమా వచ్చే ఏడాదేనా?

Mahesh Rajamouli

Mahesh-Rajamouli: సూపర్ స్టార్ తో జక్కన్న పట్టాలెక్కేది ఎప్పుడన్న ప్రశ్నపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. 2022లో మాత్రం అది జరిగేలా కనిపించడం లేదు. మహేశ్ సినిమా రిలీజ్ కి లాంగ్ గ్యాప్ పెట్టుకున్న రాజమౌళి.. దానికోసం ఇప్పటికిప్పుడు బరిలోకి దూకేలాలేరు. టైమ్ చూసుకొని.. అన్నీ కుదిరాకే.. అనుకున్నవి జరిగాకే మహేశ్ బాబుని డైరెక్ట్ చేయాలనేది జక్కన్న ప్లాన్.

Mahesh-Rajamouli: ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా మహేష్-రాజమౌళి సినిమా?

ప్రస్తుతం కమాన్ కళావతి అంటోన్న మహేశ్ బాబుకి రాజమౌళి కమాన్ చెప్పాలంటే ఇంకా ఏడాది ఆగాల్సిందే. 2022లో ఈ కాంబో వర్కవుట్ అయ్యేలాలేదు. ఆర్ఆర్ఆర్ ఈ నెలాఖరులో విడుదల అయ్యాక.. వచ్చే నెల నుంచి రాజమౌళి ఫ్రీ అవుతారు. సినిమా సినిమాకు మినిమం 1 ఇయర్ గ్యాప్ ఇచ్చే జక్కన్న.. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి మహేశ్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత సూపర్ స్టార్ డేట్స్ ను బట్టి షూటింగ్ ని ప్లాన్ చేసుకోబోతున్నారు.

Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

రెస్ట్ ప్లస్ స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావాలంటే ఏడాది పైనే పడుతుంది. అందుకే రాజమౌళి ఆస్థాన కెమెరామన్ సెంథిల్ వేరే సినిమా కోసం రంగంలోకి దిగాడు. సినిమా, సినిమాకి రాజమౌళి ఇచ్చే ఏడాది బ్రేక్ లో మాత్రమే ఏదో ఒక చిన్న సినిమాని ఒప్పుకుంటారు. రీసెంట్ గా గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరిటీ కోసం బైలింగ్వల్ కన్నడ – తెలుగు ప్రాజెక్ట్ ను సెంథిల్ టేకప్ చేశారు. మహేష్ – రాజమౌళి సినిమా నెక్ట్స్ ఇయర్ ఉంటుదన్న కాన్పెస్ట్ తోనే సెంథిల్ ఇలా డిసైడయ్యారని చెప్తున్నారు.

Mahesh Babu: చిన్నారుల హార్ట్ సర్జరీలు.. ఫౌండేషన్‌ ప్రారంభించిన మహేష్

సర్కారు వారి పాట పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తారు మహేశ్ బాబు. సర్కారు వారి పాట షూటింగ్, ప్రమోషన్స్, రిలీజ్.. ఆ తర్వాత త్రివిక్రమ్.. ఇదంతా అవ్వడానికి ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. ఈలోపు కాస్ట్ అండ్ క్రూను ఫైనల్ చేస్తారు. ట్రిపుల్ ఆర్ లో నటించిన ఆలియా భట్ ను సూపర్ స్టార్ సినిమాలోనూ జక్కన్న సెట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అందుకే రాజమౌళి – మహేష్ బాబు ఫారెస్ట్ అడ్వంచరస్ మూవీ 2023లోనే పట్టాలెక్కబోతుంది. 2024 దసరాకు రిలీజ్ చేసేలా కూడా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.