Mahesh Babu: చిన్నారుల హార్ట్ సర్జరీలు.. ఫౌండేషన్‌ ప్రారంభించిన మహేష్

చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లలో సాయం అందిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తెరమీదే కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న..

Mahesh Babu: చిన్నారుల హార్ట్ సర్జరీలు.. ఫౌండేషన్‌ ప్రారంభించిన మహేష్

Mahesh Babu

Mahesh Babu: చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లలో సాయం అందిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తెరమీదే కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్‌ ఆపద్భాందవుడిగా నిలుస్తూ వారికి సర్జరీలు చేయిస్తున్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్‌, రెయిన్ బో హస్ఫోటల్స్ తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు.

Mahesh Babu : 17 సంవత్సరాలు.. ఇదంతా ప్రేమతోనే.. మహేష్ పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్..

ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు. ఇందులో ఆంధ్రా హాస్పిటల్స్‌, లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్స్‌ కీలకంగా వ్యవహరించేవి. కాగా ఇప్పుడు మహేష్ చిన్నారుల ఆపరేషన్ల కోసం ఇప్పుడు రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయనుంది. ఇందుకోసం RCHIలో భాగంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు.

Mahesh Babu : ఫ్యాన్స్ దిల్ ఖుష్ చెయ్యబోతున్న మహేష్ బాబు..

ఈ సందర్భంగా మహేశ్‌ మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. కార్డియాక్ కేర్ అవసరమైన చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.