Rajamouli-Mahesh : ఆస్కార్ వేడుక అయితే కానీ రాజమౌళి-మహేష్ సినిమా వర్క్ మొదలవ్వదేమో??

సూపర్‌స్టార్‌ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఉంటుందని తెలిసిందే. అయితే సినిమా సెట్స్ మీదకెళ్లేది ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత..............

Rajamouli-Mahesh : ఆస్కార్ వేడుక అయితే కానీ రాజమౌళి-మహేష్ సినిమా వర్క్ మొదలవ్వదేమో??

rajamouli mahesh babu movie work will starts after oscar awards event

Rajamouli-Mahesh :  RRR మూవీ విడుదలై ఇప్పటికి 11 నెలలవుతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. గ్లోబల్ రేంజ్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. జపాన్‌లోనూ ఈ మూవీ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. రీసెంట్ గా లాస్‌ ఏంజెల్స్‌లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ నామినేషన్స్‌లోనూ చోటు దక్కించుకుంది. దీంతో మూవీ యూనిట్ అంతా సెలబ్రేషన్స్‌లో ఉంది. రాజమౌళి అయితే ఇప్పటికి అవార్డులు, ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అయితే ఇంత వరకూ రాజమౌళి నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మహేశ్ బాబు హీరోగా గ్లోబల్ వైడ్ స్టోరీతో సినిమా ఉండబోతోంది అని మాత్రం రాజమౌళి హాలీవుడ్ మీడియాతో తెలిపాడు.

సూపర్‌స్టార్‌ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఉంటుందని తెలిసిందే. అయితే సినిమా సెట్స్ మీదకెళ్లేది ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయనే వార్త కూడా స్ప్రెడ్ అయింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ లాంచింగ్ గురించి మరో అప్టేట్ బైటికొచ్చింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ అండ్ రాజమౌళి కాంబో మూవీ మార్చ్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కాబోతోందని టాక్. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత కానీ మహేష్ రాజమౌళికి డేట్స్ ఇవ్వలేడు.

అయితే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఇంకా మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఇటీవలోల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఒక వేల కథ రెడీ అయినా షూట్ కి కావలసినవి అన్ని గ్రాండ్ గా రెడీ చేసుకొని కానీ షూట్ కి వెళ్ళాడు రాజమౌళి. దానికి ఇంకా సమయం పడుతుంది. రాజమౌళి మహేష్ తో సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటివరకు దాని గురించి పెద్దగా వర్క్ చేయలేదట. గత సంవత్సరం నుంచి RRR సినిమా ప్రమోషన్స్ తోనే బిజీగా ఉన్నాడు రాజమౌళి. అసలు గత కొన్ని నెలలుగా రాజమౌళి అమెరికాలోనే ఉంటూ RRR ని ఆస్కార్ దాకా తీసుకెళ్లాడు. మార్చ్ 12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం అయితే కానీ రాజమౌళి ఇండియాకి వచ్చి నెక్స్ట్ సినిమా వర్క్ మొదలుపెట్టడని సమాచారం.

MC Stan : హిందీ బిగ్ బాస్ 16 విన్నర్ ఇతనే.. భారీ ప్రైజ్ మనీతో పాటు ఇంకేం గెలుచుకున్నారో తెలుసా?

మరి ఆ అవార్డుల కార్యక్రమాల తర్వాత రాజమౌళి-మహేష్ సినిమా కనీసం మార్చ్ లో అయినా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుందో లేదో చూడాలి. మహేష్ అభిమానులు ఈ కాంబో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎలాగో రాజమౌళి సినిమా అంటే చాలా టైం పడుతుంది. కనీసం పూజా కార్యక్రమాలు చేసి వర్క్ మొదలుపెట్టాలని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాజమౌళి ఏం చేస్తాడో, ఎప్పుడు తన నెక్స్ట్ సినిమా మొదలుపెడతాడో ఆయనకే తెలియాలి.