MC Stan : హిందీ బిగ్ బాస్ 16 విన్నర్ ఇతనే.. భారీ ప్రైజ్ మనీతో పాటు ఇంకేం గెలుచుకున్నారో తెలుసా?
ఎంతో గ్రాండ్ గా మొదలైన హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ తో ముగిసింది. మొదటి నుంచి కంటెస్టెంట్స్ తో ఆడి, అన్ని టాస్కుల్లో మెప్పించిన MC స్టాన్, శివ థాకరే, ప్రియాంక చాహర్ ఫైనల్ గా టాప్ 3లో నిలవగా....................

Bollywood Rapper MC Stan wins BiggBoss 16 Trophy
MC Stan : బిగ్‌బాస్ గేమ్ షోకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మన దేశంలో అయితే.. ఈ షోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీ, తమిళ్, కన్నడ, తెలుగులో ఈ షో నడుస్తుంది. ఈ షోకి అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. మన దేశంలో అన్నిటికంటే ముందు హిందీలో మొదలయింది బిగ్ బాస్ షో. దీంతో 15 సీజన్లతో అలరించిన హిందీ బిగ్ బాస్ తాజాగా 16వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.
బాలీవుడ్ సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్, సినిమా సెలబ్రిటీలు ఈ బిగ్‌బాస్ లో పాల్గొన్నారు. ఎంతో గ్రాండ్ గా మొదలైన హిందీ బిగ్‌బాస్ 16వ సీజన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ తో ముగిసింది. మొదటి నుంచి కంటెస్టెంట్స్ తో ఆడి, అన్ని టాస్కుల్లో మెప్పించిన MC స్టాన్, శివ థాకరే, ప్రియాంక చాహర్ ఫైనల్ గా టాప్ 3లో నిలవగా ఆదివారం నాడు సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ స్టేజిపై MC స్టాన్ ని బిగ్‌బాస్ సీజన్ 16 విన్నర్ గా ప్రకటించాడు. శివ థాకరే మొదటి రన్నరప్ గా, ప్రియాంక చాహర్ రెండవ రన్నరప్ గా నిలిచింది.
Varalaxmi Sarathkumar : సినిమా రివ్యూలు, రివ్యూలు ఇచ్చేవాళ్లపై ఫైర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్..
ఇక విన్నర్ గా గెలిచిన బాలీవుడ్ ర్యాపర్ MC స్టాన్ బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 31 లక్షల 80 వేల రూపాయలను గెలుచుకున్నాడు. అంతే కాకుండా కొత్త కారుని కూడా గెలుచుకున్నాడు. దీంతో MC స్టాన్, అతని అభిమానులు ఫుల్ సంతోషంలో మునిగిపోయారు. బాలీవుడ్ లో ర్యాప్ సాంగ్స్ తో మెప్పించిన MC స్టాన్ అక్కడ లోకల్ గా బాగా పేరు తెచ్చుకొని, అభిమానులని సంపాదించుకున్నాడు. దీంతో పాటు బిగ్‌బాస్ లో ఆట కూడా బాగా ఆడి ఓట్లు సంపాదించుకున్నాడు. మరి ఈ బిగ్‌బాస్ ఫేమ్ తో ర్యాపర్ MC స్టాన్ కి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు ఏమన్నా వస్తాయేమో చూడాలి.
WE CREATED HISTORY ?
STAYED REAL THROUGHOUT , REPPED HIPHOP ON NATIONAL TV ??
Ammi's dream poora hogaya ? & trophy P-town aagayi ♥️??♂️~ IG Post of #MCStan
HISTORIC WINNER MC STAN pic.twitter.com/FNRsrK5OW0— ?? ???? ???????? ??⛓️ (@ItsTeamMCStan) February 12, 2023