Varalaxmi Sarathkumar : సినిమా రివ్యూలు, రివ్యూలు ఇచ్చేవాళ్లపై ఫైర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్..
కొండ్రాల్ పావమ్ సినిమా ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు, రివ్యూలు ఇచ్చేవాళ్లపై ఫైర్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ................

Varalaxmi Sarathkumar fires on cinema reviews and reviewers
Varalaxmi Sarathkumar : తమిళ్, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా, వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీబిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్, సంతోష్ ప్రతాప్ కలిసి నటించిన కొండ్రాల్ పావమ్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. కన్నడ లో తెరకెక్కిన ఆ కరాళ రాత్రి సినిమా తెలుగులో అనగనగ ఓ అతిధి పేరుతో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చింది. ఇప్పుడు అదే సినిమాని వరలక్ష్మి మెయిన్ లీడ్ లో తమిళ్ లో కొండ్రాల్ పావమ్ పేరుతో తెరకెక్కించారు.
కొండ్రాల్ పావమ్ సినిమా ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా రివ్యూలు, రివ్యూలు ఇచ్చేవాళ్లపై ఫైర్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల సినిమాలు రిలీజ్ అవ్వగానే కొన్ని గంటల్లోనే రివ్యూలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో రివ్యూలు అంటూ వీడియోలు పెడుతున్నారు. కొంతమంది అయితే ట్రైలర్, టీజర్లకు కూడా రివ్యూలు చెప్తున్నారు. అసలు రివ్యూలు చెప్పడానికి వాళ్లెవరు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టమొచ్చినట్టు రివ్యూలు చెప్తున్నారు. సినిమాని ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ గా చూస్తున్నారు. ప్రేక్షకులని సినిమా చూడనివ్వకుండా చెత్త రివ్యూలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటివి చేయకండి అని ఫైర్ అయింది.