Rajamouli: సల్మాన్‌తో జక్కన్న భేటీ.. వెనుక అసలు కథేంటి?

బాహుబలితో తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేశారు. ట్రిపుల్ ఆర్ తో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ ని కూడా యాడ్ చేసి మరో మెట్టెక్కారు.

Rajamouli: సల్మాన్‌తో జక్కన్న భేటీ.. వెనుక అసలు కథేంటి?

Rajamouli

Rajamouli: బాహుబలితో తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేశారు. ట్రిపుల్ ఆర్ తో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ ని కూడా యాడ్ చేసి మరో మెట్టెక్కారు. ఈ సారి అంతకుమించిన సినిమా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చెయ్యడానికి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని కలిశారు. మరి సల్మాన్-రాజమౌళి సినిమా సైన్ చేసినట్టేనా..?

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

రాజమౌళి ఏం చేసినా అంతే.. అన్నీ భారీగానే. భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, భారీ సినిమాలు.. అంతకంటే ఎక్కువ భారీగా తీసుకునే టైమ్. ఇలా ఏం చేసినా అన్నీ లార్జ్ స్కేల్ లోనే. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి సడెన్ గా ముంబై ఎందుకెళ్లారు? వెళ్తే వెళ్లారు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని ఎందుకు కలిసినట్టు అని అందరూ టాలీవుడ్ లో తెగ ఆలోచిస్తున్నారు.

Bigg Boss 5: హౌస్‌లో ఏం జరుగుతుంది.. సిరి, షణ్ముఖ్‌లను కడిగేసిన నాగ్!

రాజమౌళి కొడుకు కార్తికేయతో కలిసి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని కలవడానికి ముంబై వెళ్లారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా త్వరలోనే అనౌన్స్ చేస్తారు అంటూ రకరకాల వార్తలు నడుస్తున్నాయి మీడియాలో. నిజానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించిన సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ భజరంగీభాయ్ జాన్ ని రాజమౌళి డైరెక్ట్ చెయ్యాల్సింది. అయితే అప్పటికే బాహుబలితో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ సినిమా చెయ్యలేకపోయాడు. అప్పటి నుంచి ఈ కాంబినేషన్ మీద న్యూస్ వినిపిస్తూనే ఉంది.

Sidhika Sharma: సిద్ధికా ఈజ్ వెరీ హాట్ స్వీట్!

సల్మాన్-రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటే ఆ సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉంటుందో గెస్ చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు విషయం మాత్రం సల్మాన్ తో రాజమౌళి సినిమా గురించి కాదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ కు సంబందించి ప్రమోషన్స్ గురించి డిస్కస్ చెయ్యడానికి వెళ్లారు రాజమౌళి. బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కు సంబందించి సల్మాన్ ను ఓ పార్ట్ చెయ్యాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు.. దానికి సంబంధించి సల్మాన్ తో మాట్లాడడానికి వెళ్లారని అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.