Rajamouli : నా భార్యే నన్ను పోషించింది : రాజమౌళి

తనకు చదువు అంతగా రాలేదని, ఇంట్లో అందరూ సినిమా వాళ్ళే కాబట్టి చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని అన్నాడు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ సినీ ఇండస్ట్రీలో ఉండడంతో అన్ని

Rajamouli :  నా భార్యే నన్ను పోషించింది : రాజమౌళి

Rajamouli

Rajamouli :  ‘బాహుబలి’ చిత్రం తర్వాత పాన్ ఇండియా వైడ్ గా రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా మొత్తం ఆయన తర్వాతి సినిమాల కోసం ఎదురు చూస్తుంది. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్ కి అటెండ్ అయిన దర్శకధీరుడు రాజమౌళి అక్కడి విద్యార్థులతో ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే తన కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి తెలిపాడు జక్కన్న.

Major Movie : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి అదరగొట్టబోతున్న అడవిశేష్..

తనకు చదువు అంతగా రాలేదని, ఇంట్లో అందరూ సినిమా వాళ్ళే కాబట్టి చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని అన్నాడు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ సినీ ఇండస్ట్రీలో ఉండడంతో అన్ని క్రాఫ్ట్స్‌లోనూ పని చేశానని చెప్పాడు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్ట్స్‌లోనూ పట్టుండాలనే అన్నీ నేర్చుకున్నాను అని అన్నారు రాజమౌళి. అయితే మద్యలో డైరెక్టర్ గా ట్రై చేస్తున్న కొన్ని రోజులు తనకు పైసా సంపాదన లేదని, నాన్నని అడిగితే ఇస్తారు కాని అడగలేకపోయానని అన్నారు. అలాంటి సమయంలో నా భార్య ర‌మా జీతం మీద బతికానని, ఆమెనే తనని పోషించిందని రాజమౌళి తెలిపాడు. అలా చెప్పుకోవడానికి తనకు సిగ్గేయడం లేదని సంతోషంగా ఉందని చెప్పాడు. తాను దర్శకుడు కాకముందు తన పనల్లా పొద్దున్నే భార్య ర‌మాను ఆఫీస్‌లో డ్రాప్ చేసి ఇంటికొచ్చి కధలు, డైలాగ్స్‌ రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం రమాని ఇంటికి తీసుకు రావడం అని అన్నాడు.

Rajashekar : సంక్రాంతి బరిలో రాజశేఖర్? స్టార్ హీరోలతో పోటీ?

అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7, 2022న విడుదల అవ్వనుంది. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.