Naatu Naatu : అనిల్ రావిపూడితో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులేసిన రాజమౌళి

ఇంటర్వ్యూలో రాజమౌళిని ఈ స్టెప్ ఎప్పుడు వేస్తారు అని అడిగితే కచ్చితంగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో వేస్తాను అని తెలిపారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నైజాం ఏరియాలో 100 కోట్లకు పై........

Naatu Naatu : అనిల్ రావిపూడితో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులేసిన రాజమౌళి

Rajamouli

 

Rajamouli :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ అయి 10 రోజులు పైనే కావొస్తున్నా ఇంకా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. త్వరలో 1000 కోట్లు కూడా సాధించే దిశగా పరుగులు పెడుతుంది ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఈ సినిమాలోని పాటల్లో నాటు నాటు సాంగ్, దానికి చరణ్, తారక్ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే.

 

నాటు నాటు పాటకు చరణ్, తారక్ కలిసి కాళ్లతో వేసిన స్టెప్ బాగా పాపులర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశ విదేశాల్లో కూడా ఈ స్టెప్ ని రీల్స్ చేసి మరీ వైరల్ చేశారు. ఎంతో మంది నెటిజన్లు ఈ పాటకి ఈ స్టెప్ తో రీల్స్ చేశారు. సెలబ్రిటీలు కూడా ఈ పాటకి స్టెప్పులేశారు , అంతగా ఈ పాట పాపులర్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో చాలా స్టేజిల మీద కూడా చరణ్, తారక్ ఈ పాటకి డ్యాన్స్ చేశారు. అంతే కాక అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్ లతో కూడా కలిసి ఈ స్టెప్ వేశారు. కానీ అన్ని ప్రమోషన్స్ ని ముందుండి నడిపించిన రాజమౌళి మాత్రం ఒక్కసారి కూడా ఈ స్టెప్ వేయలేదు.

Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో అనిల్ రావిపూడి వీరిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని ఈ స్టెప్ ఎప్పుడు వేస్తారు అని అడిగితే కచ్చితంగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో వేస్తాను అని తెలిపారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నైజాం ఏరియాలో 100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టడంతో నైజాం పంపిణీదారుడు, నిర్మాత దిల్‌ రాజు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి స్పెషల్ విందు ఏర్పాటు చేసి, సక్సెస్ సెలబ్రేషన్స్ చేశాడు. ఈ పార్టీకీ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళితో పాటు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

OTT Release: థియేటర్ రిలీజ్ ఒక్కటే సినిమా.. టైమ్ చూసి దాడికి సిద్దమైన ఓటీటీలు!

ఈ సందర్భంగా యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో కలిసి రాజమౌళి నాటు నాటు పాటకి చరణ్, తారక్ కలిసి వేసిన స్టెప్పులని వేశాడు. వీరిద్దరూ స్టెప్స్ వేస్తుండటంతో అక్కడ పార్టీకి వచ్చిన వారంతా అరుస్తూ, విజిల్స్ వేస్తూ హంగామా చేశారు. ఇలా అనిల్ కి ఇంటర్వ్యూలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాడు రాజమౌళి. ఇక అనిల్ రావిపూడి, రాజమౌళి కలిసి వేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.