OTT Release: థియేటర్ రిలీజ్ ఒక్కటే సినిమా.. టైమ్ చూసి దాడికి సిద్దమైన ఓటీటీలు!

ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ధియేటర్లతో పాటు ఓటీటీలు కూడా వీకెండ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ధియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఓటీటీలో ఇటు తెలుగు, తమిళ్, హిందీ..

OTT Release: థియేటర్ రిలీజ్ ఒక్కటే సినిమా.. టైమ్ చూసి దాడికి సిద్దమైన ఓటీటీలు!

Ott Release

OTT Release: ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ధియేటర్లతో పాటు ఓటీటీలు కూడా వీకెండ్ కి రెడీ అవుతున్నాయి. ఈ వారం ధియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఓటీటీలో ఇటు తెలుగు, తమిళ్, హిందీ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ ఇంట్రస్టింగ్ సిరీస్, సినిమాలు కూడా ఎంగేజ్ చెయ్యబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలు, ధియేటర్లో ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

OTT Release: థియేటర్‌లో క్రేజీ సినిమాలు.. అయినా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

రెండు వారాల నుంచి ట్రిపుల్ ఆర్ సినిమా సందడే కంటిన్యూ అవుతోంది. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి చిన్న సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయి. అలా ఈ వీకెండ్ ఏప్రిల్ 8న ధియేటర్లోకొస్తోంది గని మూవీ. వరుణ్ తేజ్, సాయిమంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో అల్లు బాబీ నిర్మించిన సినిమా గని ఈ శుక్రవారం ధియేటర్లో రిలీజ్ అవుతోంది. కంప్లీట్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 8న ధియేటర్లోకొస్తోంది. రీజనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కూడా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వబోతోంది.

Ghani: గని కోసం వరుణ్ వేరియేషన్.. ఆశలు తీరుస్తుందా?

ఓటీటీలు మాత్రం ఈ వారం ఫుల్ స్వింగ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 6 నుంచి మొదలు పెట్టి వీకెండ్ వరకూ వరసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. వీటిలో ఏప్రిల్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తోంది ఈటి. సూర్య, ప్రియాంకా జంటగా నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామాఎంటర్ టైనర్ సూర్యలోని కంప్లీట్ మాస్ యాంగిల్ ని చూపించింది. ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే అచ్చతెలుగు ఓటీటీయాప్ ఆహా లో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ స్టాండప్ రాహుల్ ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. రాజ్ తరుణ్, వర్ష జంటగా తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్.. ఆహా ఆడియన్స్ ని ఈ శుక్రవారం నుంచి అలరించబోతోంది.

Raj Tharun: ఆడియెన్స్‌ను సీట్లలో కూర్చోబెట్టలేకపోయిన స్టాండప్ రాహుల్

బాలీవుడ్ కి సంబంధించి ఓటీటీలో రిలీజ్ అవుతోన్న ఇంట్రస్టింగ్ మూవీ దస్వీ. ఓటీటీలో డిఫరెంట్ సబ్జక్ట్స్ చేస్తూ.. తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్న అభిషేక్ బచ్చన్.. ఈసారి మరో కొత్త సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 10 క్లాస్ పాస్ అవ్వడమే ఎయిమ్ గా పెట్టుకున్న బీహార్ లోని ఖైదీ రాజకీయనాయకుడిగా దస్వీ మూవీలో అభిషేక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. యామీ గౌతమ్ స్ట్రిక్ట్ జైలర్ రోల్ లో కనిపిస్తున్న ఈ దస్వీ మూవీ నెట్ ఫ్లిక్స్ తో పాటు జియో సినిమాలో ఏప్రిల్ 7.. ఈ గురువారం నుంచి అవైలబుల్ గా ఉంటోంది.

Surya ET Movie: రాధేశ్యామ్‌కి పోటీగా ఈటీ.. సూర్య నమ్మకం ఏంటో?

హాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సిరీస్ లతో ఎంగేజ్ అయిపోతున్నాయి ఓటీటీలు. కొరొయన్ సైఫై మిస్టరీ డ్రామా హ్యాపీ నెస్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 6 నుంచిస్ట్రీమ్ అవుతోంది. డాక్యుమెంటరీ డ్రామాగా తెరకెక్కిన రిటర్న్ టూ స్పేస్ మూవీ ఏప్రిల్ 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అవైలబుల్ అవుతోంది. మళయాళ ధ్రిల్లర్ డ్రామా మూవీ నారదన్ అమెజాన్ లో ఏప్రిల్ 8 న రిలీజ్ అవుతుంటే.. ఏక్ లవ్ యా అనే కన్నడ రొమాంటిక్ మూవీ జీ5లో ఏప్రిల్ 8నే స్ట్రీమ్ అవుతోంది. ఇక తానక్కరన్ తమిళ్ డ్రామా మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. యాక్షన్ అడ్వెంచర్ కామెడీ మూవీ ద కింగ్స్ మ్యాన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 8 నుంచి ఇంగ్లీష్, హిందీలో ఆడియన్స్ కి అవైలబుల్ గా ఉంటోంది.