OTT Release: థియేటర్‌లో క్రేజీ సినిమాలు.. అయినా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

ఈ వారం ధియటేర్లో రిలీజ్ అయ్యేది చాలా తక్కువ సినిమాలే. కానీ ఓటీటీలో మాత్రం కామెడీ, యాక్షన్ రొమాన్స్ ఇలా ఏ జానర్ కి కావల్సిన సినిమాలు ఆ జానర్ వాళ్లని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీగా..

OTT Release: థియేటర్‌లో క్రేజీ సినిమాలు.. అయినా తగ్గేదేలే అంటున్న ఓటీటీలు!

Ott Release

OTT Release: ఈ వారం ధియటేర్లో రిలీజ్ అయ్యేది చాలా తక్కువ సినిమాలే. కానీ ఓటీటీలో మాత్రం కామెడీ, యాక్షన్ రొమాన్స్ ఇలా ఏ జానర్ కి కావల్సిన సినిమాలు ఆ జానర్ వాళ్లని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లూ మీకు జోహార్లు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రష్మిక, శర్వానంద్ జంటగా తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 2 ఉగాది సందర్భంగా సోనీ లివ్ యాప్ లో అవైలబుల్ గా ఉంటోంది.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయంలో బాలీవుడ్ బాగా ఎగ్జైట్ చేస్తోంది. స్పెషల్లీ రిలీ అవుతున్న సినిమాలన్నీ సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ మూవీసే. వాటిలో మార్చి 31న అమెజాన్ లో రిలీజ్ అవుతున్న సినిమా శర్మాజీ నమ్కీన్. రిషి కపూర్, పరేష్ రావల్ కలిసి నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్.. రిషి కపూర్ లాస్ట్ మూవీ కావడంతో ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసి లైఫ్ ని ఇంట్రస్టింగ్ గా ప్లాన్ చేసుకున్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు రిషి కపూర్.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా కౌన్ ప్రవీణ్ తాంబే. 40 సంవత్సరాల వయసులో నేషనల్ లెవల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబే లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో ప్రవీణ్ క్యారెక్టర్ లో శ్రేయస్ తల్పడే కనిపిస్తున్నారు. జయప్రద్ దేశాయ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ బయోపిక్ ఏప్రిల్ ఫస్ట్ న డిస్నీ హాట్ స్టార్ లో.. హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. వీటితో పాటు రాహుల్ దేశ్ పాండే లీడ్ రోల్స్ లో.. మి వసంత్ రావ్ అనే బయోపిక్ కూడా ఏప్రిల్ ఫస్ట్ నే రిలీజ్ అవుతోంది.

2021 Hindi OTT Releases: బాలీవుడ్‌‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!

యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా గా తెరకెక్కిన ఫిక్షన్ మూవీ మూన్ నైట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 30 నుంచి ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ్, మళయాళంలో రిలీజ్ అవుతోంది. స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో మార్చి 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది.