OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

స్టార్ హీరోల సినిమాలు నేరుగా ఇంటికొచ్చేడయం.. స్మార్ట్ స్క్రీన్ లోనే దర్జాగా ఫ్యామిలీతో చూసేయడం.. ఎవ్వరూ ఊహించలేదు. 2020లో స్టార్ట్ అయిన ఓటీటీ ట్రెండ్ 2021లో పీక్స్ కి చేరుకుంది.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

Ott Release

OTT Release: స్టార్ హీరోల సినిమాలు నేరుగా ఇంటికొచ్చేడయం.. స్మార్ట్ స్క్రీన్ లోనే దర్జాగా ఫ్యామిలీతో చూసేయడం.. ఎవ్వరూ ఊహించలేదు. 2020లో స్టార్ట్ అయిన ఓటీటీ ట్రెండ్ 2021లో పీక్స్ కి చేరుకుంది. కొవిడ్ కారణంగా 2021లో ఓటీటీ పెద్ద ప్రభంజనమే సృష్టించింది. వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, డైరెక్ట్ ఎంట్రీలు.. ఈ ఏడాది డిటిజల్ సందడి మామూలుగా లేదు. ఈ ఏడాది ఓటీటీకి ఓటేసి ప్రేక్షకుల ఇంటికే వచ్చేశారు కొందరు టాలీవుడ్ స్టార్స్.

Bangarraju: నాగ్ లెక్కే కరెక్ట్ అయింది.. జాక్ పాట్ కొట్టేశాడుగా!

వెంకీ నారప్పతో పెద్ద హీరోల హంగామా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మొదలైంది. ఆ తర్వాత దృశ్యం 2ను కూడా డైరెక్ట్ ఓటీటీకే తీసుకొచ్చారు. సెంటిమెంట్స్ ను పక్కనపెట్టి బిజినెస్ ఫార్ములాను ఫాలో అయిన నిర్మాత సురేశ్ బాబు ఈ డిజిటల్ ఎంట్రీలలో లాభాలనే చూశారు. ఒకే ఏడాది రెండు సినిమాలను స్ట్రైయిట్ గా హోమ్ రిలీజ్ చేసిన స్టార్ అనిపించుకున్నారు వెంకటేశ్.

Telugu Senior Hero’s: తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సీనియర్ హీరోలు!

2020లో డైరెక్ట్ గా ప్రైమ్ లో వి రిలీజ్ చేసిన నాని.. 2021లో టక్ జగదీష్ ను లైన్లోపెట్టారు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నెగెటివిటీ తగిలినా నిర్మాతల నిర్ణయానికే ఓటేశాడు నాని. అంధాధూన్ రీమేక్ గా వచ్చిన నితిన్ మ్యాస్ట్రోని ఓటీటీ రూట్ పట్టించి.. తెలివైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. హాట్ స్టార్ లో డైరెక్ట్ ఇచ్చిన మ్యాస్ట్రో అక్కడ బాగానే వర్కవుట్ అయింది. ఏక్ మినీ కథతో ఎంట్రీ ఇచ్చిన సంతోశ్ శోభన్ లైమ్ లైట్ లోకొచ్చాడు.

RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

2021లో చెప్పుకోవాల్సింది థియేట్రికల్ రిలీజ్, ఓటీట రిలీజ్ ల మధ్య గ్యాప్ గురించి. థియేటర్ లో ఎంత పెద్ద హిట్ సినిమా అయిన పెద్ద గ్యాప్ లేకుండా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ క్రాక్ నెల రోజుల తేడాతోనే ఆహాలోకి వచ్చేసింది. 50రోజుల తర్వాత ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంతే ఎర్లీగా డిజిటల్ బాట పట్టాయి. ఎస్ ఆర్ కల్యాణ మండపం, మంచి రోజులు వచ్చాయి, అనుభవించు రాజా, రొమాంటిక్, పుష్పక విమానం లాంటి చిన్న సినిమాలైతే కేవలం 30 రోజుల గ్యాప్ మాత్రమే తీసుకున్నాయి.

Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

వెబ్ సిరీస్ ల హవా జోరుగా కనిపించింది 2021లో. ముఖ్యంగా టాప్ హీరోయిన్స్ ఎంట్రీతో ఆకట్టుకున్నారు. లైవ్ టెలీకాస్ట్ తో కాజల్ పర్వాలేదనిపించింది. ఆహాలో లెవంత్ అవర్ చేసిన తమన్నా.. హాట్ స్టార్ కోసం నవంబర్ స్టోరీతో ముందుకొచ్చింది. ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ తో సమంతా నేషనల్ వైడ్ ఫుల్ గా పాపులరయింది. అమలాపాల్ చేసిన ఆహా సిరీస్ కుడి ఎడమైతే కి హ్యాజ్ రెస్పాన్స్ దక్కింది. శృతీహాసన్, సాయిపల్లవి, అంజలి, ఈశారెబ్బ, పూర్ణ లాంటి హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లు, అంథాలజీ స్టోరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను థ్రిల్ చేశారు.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

రూరల్ తెలంగాణ 2000 బ్యాక్ డ్రాప్ తో మెయిల్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు కొత్త డైరెక్టర్ ఉదయ్ గుర్రాల. ప్రవీణ్ కంద్రేగుల సినిమా బండిని సెట్ చేశాడు. లేటెస్ట్ రిలీజెస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్ వెబ్ సీరీస్ లకు మంచి మార్కులే పడ్డాయి. ఇక డబ్బింగ్ వెబ్ సిరీస్ ల జోరు 2021లో బాగా పెరిగింది. బాలీవుడ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్2 మన దగ్గర బాగానే అట్రాక్ట్ చేసింది. ఇక మనీ హీస్ట్ 5, స్క్విడ్ గేమ్ సంచలనాలు ఇప్పట్లో మర్చిపోయేవి కావు.

Malaika Arora: మతి చెడగొడుతున్న మలైకా అందం!

తారక్, తమన్నా లాంటి స్టార్స్ కొత్తగా హోస్ట్ అవతారం ఎత్తారు. ఆహా స్పెషల్ గా తీసుకొచ్చిన అన్ స్టాపబుల్ ఈ ఏడాది పెద్ద సంచలనమే. నెవర్ బిఫోర్ బాలయ్యను చూస్తున్నారు జనాలు. దెబ్బకి థింకింగ్ మారిపోవాలన్నట్టు బాలయ్య చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గెస్ట్ లతో బాలయ్య ఇంటరాక్షన్, ఆయన మేనరిజమ్స్, పలికే డైలాగ్స్ అన్నీ.. అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాయి. ఆహాకు సూపర్ సక్సెస్ తెచ్చిపెట్టాయి.