OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

పెద్ద సినిమాలు, బిగ్ స్టార్స్ సంగతెలా ఉన్నా మంచి డీల్ అనుకుంటే ఓటీటీ బాట పడుతున్నాయి మినిమమ్ బడ్జెట్ సినిమాలు.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

Ott Releases

OTT Releases: పెద్ద సినిమాలు, బిగ్ స్టార్స్ సంగతెలా ఉన్నా మంచి డీల్ అనుకుంటే ఓటీటీ బాట పడుతున్నాయి మినిమమ్ బడ్జెట్ సినిమాలు. అయితే టాలీవుడ్ నుంచి ఇలాంటి డీల్స్ తక్కువే. మంచి స్టార్ కాస్టింగ్ ఉన్న తమిళ్, మలయాళ, హిందీ సినిమాలు ఎక్కువగా డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ కన్నా ఓటీటీ ఆఫర్ అదిరింది అనుకుంటే చాలు వెంటనే స్ట్రీమింగ్ కి సై అనేస్తున్నారు.

OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

తెలుగులో పెద్దగా కనిపించడం లేదు కానీ తమిళ్, మలయాళంలో మాత్రం ఓటీటీ జోరు ట్రెండ్ అవుతోంది. నిర్మాతలు డిజిటల్ బాట పడుతుంటే అక్కడి పెద్ద హీరోలు సైతం నో చెప్పడం లేదు. మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన మలయాళీ ఫిల్మ్ బ్రోడాడీ రీసెంట్ గానే హాట్ స్టార్ లో రిలీజైంది. లూసిఫర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ అయినా సరే థియేటర్స్ కోసం వెయిట్ చేయలేదు మేకర్స్.

Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

కొడుకు ధృవ్ తో కలిసి చియాన్ విక్రమ్ నటించిన సినిమా మహాన్. ఫస్ట్ టైమ్ విక్రమ్ కొడుకుతో వస్తున్నాడంటే ఎంత క్రేజ్ ఉంటుంది. కానీ అలాంటిదేం లేదన్నట్టు ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో మహాన్ ని తీసుకొస్తున్నారు. పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తమిళ్ తో పాటూ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది మహాన్.

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

అత్రాంగి రేతో ఈమధ్యే ఓటీటీ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ధనుశ్ తన నెక్ట్స్ మూవీని సైతం ఓటీటీలోనే చూపించబోతున్నాడు. హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరిలోనే మారన్ రిలీజ్ కాబోతుంది. మాళవిక మోహనన్ హీరోయిన్ కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాడు డైరెక్టర్ కార్తీక్ నరేన్. అత్రాంగి రేను బాలీవుడ్ ఖాతాలో వేసినా.. జగమే తంత్రం తర్వాత సౌత్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ధనుశ్ లోకల్ సినిమా ఇది.

Tollywood Star Hero’s: ఈమధ్య కాలంలో వినని.. చూడని స్టార్ హీరోల లైనప్స్!

చాలా కాలం నుంచి థియేటర్స్ లో సరైన హిట్ లేక డీలాపడ్డ సుమంత్ ఈసారి ఓటీటీ లక్ చెక్ చేసుకోబోతున్నాడు. సుమత్ రీసెంట్ మూవీ మళ్లీ మొదలైంది ఫిబ్రవరి 11న జీ5లో డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది. మళ్లీ మొదలైంది ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేటయింది. అటు సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న శాకినీ డాకినీ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రెజీనా, నివేథా థామస్ లీడ్ రోల్స్ చేశారు.

Sarkaru Vaari Paata: సింగిల్ కష్టాలు.. మరో అగ్నిపరీక్షకు రెడీ అయిన థమన్!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా దీపికా పదుకొనె లీడ్ రోలే చేసిన మూవీ ‘గెహ్రైయాన్’. ఫిబ్రవరి 11న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. దుబే అంటూ రీసెంట్ గా హాట్ సాంగ్ తో సైతం రచ్చ చేస్తోంది దీపికా. ఎప్పుడూ గ్లామర్ తో కట్టి పడేసే దీపికా పదుకొనె ఈసారి సిద్ధాంత్ చతుర్వేదితో ఇంటిమేట్ సీన్స్ లో సైతం రెచ్చిపోయింది. అనన్య పాండే ఇందులో మరో హీరోయిన్ గా నటించింది.

RRR రెండు రిలీజ్ డేట్స్.. చిన్న సినిమాలకు బెంగ!

కొవిడ్ టైమ్ లో ఓటీటీ స్టార్ అనిపించుకున్న తాప్సీ.. ఫిబ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో కొత్త సినిమా లూప్ లపేటాతో కనిపించబోతుంది. జర్మన్ హిట్ మూవీ ‘రన్ లోలా రన్’రీమేక తెరకెక్కిన లూప్ లపేటాను ముందు థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు మళ్లీ మొదటికే రావడంతో ఓటీటీ బాటపట్టారు. థ్రీల్లర్, కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కతున్న ఈ మూవీలో తాప్సీ సవిగా లీడ్ ‌రోల్‌ చేయగా.. ఇందులో ఆమె లవర్ గా తాహిర్ రాజ్ భాసిన్‌ కనిపించనున్నాడు.