Tollywood Star Hero’s: ఈమధ్య కాలంలో వినని.. చూడని స్టార్ హీరోల లైనప్స్!

మెగాస్టార్ మాత్రమే కాదు.. హైప్ ఉన్నప్పుడే హైని చూడాలనేది మరికొందరి స్టార్స్ ప్లాన్ కూడా. పవన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మంచి కమర్షియల్ కథతో..

Tollywood Star Hero’s: ఈమధ్య కాలంలో వినని.. చూడని స్టార్ హీరోల లైనప్స్!

Tollywood Star Hero's (1)

Updated On : January 27, 2022 / 9:40 PM IST

Tollywood Star Hero’s: మెగాస్టార్ మాత్రమే కాదు.. హైప్ ఉన్నప్పుడే హైని చూడాలనేది మరికొందరి స్టార్స్ ప్లాన్ కూడా. పవన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మంచి కమర్షియల్ కథతో డైరెక్టర్ దొరికితే.. దాన్ని బ్యాకప్ చేసి.. అడిగినంత రెమ్యునరేషన్ తో ప్రొడ్యూసర్ సై అంటే చాలు ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు టాలీవుడ్ స్టార్స్. అందుకే ఈమధ్య కాలంలో వినని, చూడని లైనప్స్ ఆడియెన్స్ ముందుకొచ్చేస్తున్నాయి.

Raviteja: బాలీవుడ్‌పై మనసు పారేసుకున్న మాస్‌రాజా.. ఖిలాడీగా ఎంట్రీ!

60 రోజుల డేట్స్ తోనే అడ్జస్ట్ అవమంటున్నారు పవర్ స్టార్. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వడివడిగా సినిమాలు చేసేందుకు పక్కా స్కెచ్ అమలుచేస్తున్నారు. అందుకే నిన్నమొన్నటి వరకు కాస్త స్లోగానే కనిపించిన పవర్ స్టార్.. ఇప్పుడు క్యూలో సినిమాలను పెడుతున్నారు. స్పీడ్ గా లైనప్ పెంచేస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లు వసూలు చేసే పవర్ స్టార్ కోసం.. మేకర్స్ కూడా కథలు పట్టుకుని రెడీగా ఉన్నారు.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

రీసెంట్ గా నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ కి రెడీఅయింది. హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. హరీశ్ శంకర్ భవధీయుడు భగత్ సింగ్ మొదలెట్టాల్సి ఉంది పవన్ కల్యాణ్. నెక్ట్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ సినిమా ఉంటుంది. వీలైతే త్రివిక్రమ్ కూడా పవర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అంటే ప్రకటించాల్సిన సినిమాలు పవన్ డైరీలో మరో రెండు రెడీగా ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

2022 నాదే అన్నంత రేంజ్ లో క్రేజ్ చూపిస్తున్నాడు మాస్ రాజా. క్రాక్ తో పెరిగిన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఖిలాడి రిలీజ్ కి రెడీ కాగా.. లైనప్ లో ధమాకా, రామారావ్ ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలు ఉన్నాయి. చిరూ – బాబీ సినిమాలో కూడా మాస్ రాజా ఫైనల్ అయినట్టే. మరీ చిరూ, ప్రభాస్, పవన్ లా రెమ్యునరేషన్ హైగా హైక్ చేయలేదు కానీ.. ఒక్కో సినిమాకు గట్టిగానే రాబడుతున్నారు రవితేజ.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

ఖిలాడి మూవీని బాలీవుడ్ లో కూడా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే మాస్ రాజా నెక్ట్ ప్రాజెక్టులు కూడా బాలీవుడ్ బాట పడతాయి. పాన్ ఇండియా రేంజ్ కోసం ఇలా రవితేజ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి 11న ఖిలాడి వచ్చేస్తే.. రామారావు ఆన్ డ్యూటీ ఈ మార్చి 25న రిలీజవుతుంది. ఎక్కడ తేడా కొట్టినా ధమాకా, అండర్ ప్రొడక్షన్ లో టైగర్ నాగేశ్వర్ రావు, రావణసుర సినిమాలపై ఎఫెక్ట్ పడుతుంది. రవితేజ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమాలన్నింటి నుంచి అప్ డేట్స్ తో పాటూ.. చిరూ – రవితేజ – బాబీ కాంబోకి సంబంధించి కూడా న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది.