Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

హీరోయిన్లు ఎక్కడున్నా న్యూస్ మేకర్సే. ఏం చేసినా.. ఏమీ చెయ్యకపోయినా.. సంప్రదాయబద్దంగా బట్టలేసుకున్నా, స్టైలిష్ గా రెడీ అయినా.. ఇలా ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు మన హీరోయిన్లు.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

Actress Dressing

Actress Dressing: హీరోయిన్లు ఎక్కడున్నా న్యూస్ మేకర్సే. ఏం చేసినా.. ఏమీ చెయ్యకపోయినా.. సంప్రదాయబద్దంగా బట్టలేసుకున్నా, స్టైలిష్ గా రెడీ అయినా.. ఇలా ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు మన హీరోయిన్లు. అయితే ఒక్కోసారి వాళ్లు స్టైలిష్ గా వేసుకున్న బట్టలు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడయాలో ట్రోలింగ్ కి ఓ రేంజ్ లో దొరికిపోతారు ఈ భామలు. లేటెస్ట్ గా డ్రెస్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ చేత తిట్లు తింటున్నారు హీరోయిన్స్.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

ఈ మధ్య హీరోయిన్ల స్టైల్ స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. అందుకే ఏదో స్టైల్ గా ఉంటుందనో, డిఫరెంట్ గా ఉంటుందనుకునో వేసుకున్న డ్రెస్ లు డిజాస్టర్ అయ్యి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దొరికిపోతారు. మొన్నీమధ్య రష్మిక మందాన కూడా ఇలాగే అడ్డంగా బుక్కయ్యింది. ఎయిర్ పోర్ట్ లో అసలు షార్ట్స్ కనిపించకుండా వేసుకున్న స్వెట్ షర్ట్ డ్రెస్ ని చూసి డ్రెస్ బాగా చిన్నదైంది.. రష్మిక కి స్టైల్ బాగాఎక్కువైంది అనుకుంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్స్.

Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పెద్దగా ఇలాంటి డ్రెస్ లు వేసుకోకపోయినా.. బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం అడ్డంగా బుక్కైపోతారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా దీపికా పదుకోన్ కూడా జాయిన్ అయ్యింది. అల్ట్రా మోడర్న్ డ్రెస్ లతో స్టైల్ తో అదరగొట్టే ఈ స్టార్ హీరోయిన్.. సినిమా ప్రమోషన్స్ కి వేసుకొచ్చిన ఆరెంజ్ కలర్ డ్రెస్ తో నెటిజన్స్ కామెంట్స్ కి పని పెట్టింది. అంతేకాదు.. ట్రైలర్ లాంచ్ లో వేసుకున్న రెడ్ డ్రెస్ గురించి నెగెటివ్ కామెంట్స్ ఫేస్ చేసింది దీపికా.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

ఇక బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అనన్య పాండే కూడా నెటిజన్స్ ట్రోలింగ్ కి దొరికిపోయింది. తన అప్ కమింగ్ మూవీ గెహరాయియా.. మూవీ ప్రమోషన్స్ కి అటెండ్ అయిన అనన్య డ్రెస్ చూసి అవాక్కయ్యారు అక్కడున్నవాళ్లంతా. ఇక సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా.. ఇంకా బ్రౌన్ కలర్ టాప్, స్కిన్ కలర్ కాంబినేషన్ బాటమ్ వేసుకున్న అనన్యని ఇంత కన్నా మంచి డ్రెస్ దొరకలేదా..? ఇంకా చిన్న పిల్లవనుకుంటున్నావా..? మెడకు కట్టుకునే.. బో.. డ్రెస్ గా వాడేశావేంటి.. అంటూ రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.