OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

ఎక్కడెక్కిడి వెబ్ సిరీస్ లు ఇక్కడ రికార్డ్ సృష్టిస్తుంటే.. మన వాళ్లకు మాత్రం ఆ రేంజ్ లో సృష్టించడం కత్తి మీద సాములా మారింది.

OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

Bahubali Ott

OTT Baahubali: ఎక్కడెక్కిడి వెబ్ సిరీస్ లు ఇక్కడ రికార్డ్ సృష్టిస్తుంటే.. మన వాళ్లకు మాత్రం ఆ రేంజ్ లో సృష్టించడం కత్తి మీద సాములా మారింది. 150 కోట్లు బడ్జెట్ పెట్టాక కూడా చేసేదేమి లేక డస్ట్ బిన్ లో పడేయాల్సి వచ్చిందంటే.. మనవాళ్ల క్రియేటివిటీకి ఇది నిజంగా సవాలు లాంటిందే. అవును బాహుబలి వెబ్ సిరీస్ వెనుకున్న స్టోరీ వింటే ఈ మాటలు నిజమే అనిపిస్తాయి.

Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

మనీ హీస్ట్, స్క్విడ్ గేమ్ లాంటి వెబ్ సిరీస్ లను ఇండియాలో రిలీజ్ చేసి నెట్ ఫ్లిక్స్ ఎంత సొమ్ము చేసుకుందో అందరికీ తెలిసిందే. అదే నెట్ ఫ్లిక్స్ బాహుబలి వెబ్ సిరీస్ ని నిర్ధాక్షిణ్యంగా డస్ట్ బిన్ లో వేసింది. దీన్ని బట్టి మనవాళ్లకి ఓటీటీలో అంత సీన్ లేదా అనే మాటలు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయి. కొత్త స్టోరీ కాదు.. రాజమౌళి ఓ రేంజ్ లో నేషనల్ వైడ్ కనెక్ట్ చేసిన బాహుబలికి ప్రీక్వెల్. అయినా సరే సరిగా తెరకెక్కించలేక.. నెట్ ఫ్లిక్స్ ని సంతృప్తి పరచలేక డైరెక్టర్స్ చేతులెత్తేసారు. అంటే ఓటీటీ కంటెంట్ కూడా హాట్ గా రావాలంటే జక్కన్న చెక్కాల్సిందేనా..

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

బాహుబలికి ముందు జరిగిన కథతో అంటే ప్రీక్వెల్ తో నెట్ ‏ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్‏ తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. శివగామి స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ”బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్” పేరుతో ఈ సిరీస్ ని ప్రకటించారు. తెలుగు తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లతో పాటూ మరికొన్ని లాంగ్వెజెస్ లో తొమ్మిది భాగాలుగా నిర్మించాలన్నది ప్లాన్. మొదట్లో దీని కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ దేవ కట్టా – ప్రవీణ్ సత్తారు వర్క్ చేశారు. యంగ్ శివగామిగా బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి నటించింది. అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సగానికి పైగా సిరీస్ ని పూర్తి చేసిన తర్వాత అవుట్ పుట్ సరిగా లేదని నెట్ ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ ను రీషూట్ చేసింది.

Singer Kousalya : సింగర్ కౌసల్యకు కరోనా పాజిటివ్

ఈసారి దేవకట్టా – ప్రవీణ్ సత్తారు తప్పుకుని వాళ్ల ప్లేస్ లో కునాల్ దేశ్ ముఖ్, రిభు దాస్ గుప్తాలు బోర్డు పైకొచ్చారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. శివగామి రోల్ కోసం మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నయనతార నేమ్ కూడా ఇందులో ట్రెండ్ అయింది. మళ్లీ కొత్త బడ్జెట్ తో టీమ్ మొత్తాన్ని మార్చేసి సిరీస్ ని రీస్టార్స్ చేశారు. అయితే ఇక్కడా సేమ్ ప్రాబ్లమ్. దాదాపు 6 నెలల పాటు షూటింగ్ చేసిన తర్వాత అవుట్ ఫుట్ అనుకున్నట్టు లేకపోవడంతో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పూర్తిగా నిలిపివేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకుంది. 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడందరికీ షాకిస్తుంది.

James: పునీత్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. జేమ్స్ ఫస్ట్ లుక్ చూశారా?

నెట్ ఫ్లిక్స్ కి 150 కోట్లన్నది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడి వాళ్ల క్రియేటివిటిపై దెబ్బకొట్టినట్టయింది. బాహుబలి కథను డీల్ చేయాలంటే జక్కన్న దిగి రావాల్సిందేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ లు నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్టయ్యాయి. కానీ ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ను ఇండియా కంటెంట్ పూర్తిస్థాయిలో పలకరించలేదనే చెప్పాలి. అందుకే ముందు రీజనల్ ప్రేక్షకుల మనసు దోచుకొని అటు వరల్డ్ వైడ్ స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ కు బాహుబలి టచ్ ఇద్దామనుకున్న నెట్ ఫ్లిక్స్ ఆశ ప్రస్తుతానికైతే అటకెక్కినట్టే.