Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

నిజానికి చిన్న సినిమా.. అయినాసరే.. ఆ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి స్టార్ హీరో పెద్ద మనసుతో ముందు కొచ్చాడు.

Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

Good Luck Sakhi

Good Luck Sakhi: నిజానికి చిన్న సినిమా.. అయినాసరే.. ఆ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి స్టార్ హీరో పెద్ద మనసుతో ముందు కొచ్చాడు. కీర్తిసురేష్ లీడ్ రోల్ లో తెలుగులో ఇప్పటి వరకూ రాని ఇంట్రస్టింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది గుడ్ లక్ సఖి. సినిమా టైటిల్ లో తప్పించి ఇప్పటి వరకూ రిలీజ్ విషయంలో బ్యాడ్ లక్ ఫేస్ చేసిన ఈమూవీ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది.

కీర్తిసురేష్, ఆదిపినిశెట్టి లీడ్ రోల్స్ లో జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సినిమా గుడ్ లక్ సఖి. షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి నగేష్ కుకునూర్ డైరెక్టర్. చిన్న సినిమా అయినా కూడా కాన్సెప్ట్ కొత్తది కావడంతో ఫస్ట్ నుంచి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో ఈ మధ్య బజ్ కాస్త తగ్గింది. ఇలాంటి టైమ్ లో గుడ్ లక్ సఖి కి గుడ్ లక్ చెప్పడానికి రంగంలోకి దిగారు రామ్ చరణ్.

జనవరి 28న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గుడ్ లక్ సఖి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే చిరంజీవి కి కోవిడ్ రావడంతో తన ప్లేస్ లో కొడుకుని పంపించారు. విమెన్ సెంట్రిక్ స్పోర్ట్స్ డ్రామా అయిన ఈ మూవీని సపోర్ట్ చెయ్యడానికి రామ్ చరణ్ ఎంతో గ్రేస్ ఫుల్ గా ఈవెంట్ కి అటెండ్ అయ్యి సందడి చేశారు.

ఎక్కువ మంది విమెన్ టెక్నీషియన్స్ పనిచేసిన గుడ్ లక్ సఖి మూవీ.. ఫస్ట్ నుంచి ఇంట్రస్ట్ గ్రాబ్ చేస్తూనే ఉంది. దాదాపు సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈమూవీకి లాస్ట్ స్టేజ్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ తోపాటు మెగా హీరో బూస్టప్ ఇవ్వడంతో ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతోంది. రామ్ చరణ్ కూడా ఏదో ఈవెంట్ కి వచ్చామా.. 4 మాటలు తూతూమంత్రంగా మాట్లాడామా అని కాకుండా.. కీర్తితో కలిసినాటు నాటు సాంగ్ కిస్టెప్పులుకూడా వేసి ఆడియన్స్ ని చీరప్ చేశారు. మరి ఇంత సందడి తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ మూవీ ధియేటర్ రెస్పాన్స్ బావుంటుందని కానఫిడెంట్ గా ఉన్నారు టీమ్. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.