2021 Hindi OTT Releases: బాలీవుడ్‌‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!

2021లో బాలీవుడ్ థియేటర్స్ కొచ్చిన సినిమాలే చాలా తక్కువ. అందులో హిట్స్ ఇంకా తక్కువ. అయితే కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. కొవిడ్ టైమ్ లో..

2021 Hindi OTT Releases: బాలీవుడ్‌‌ను ఆదుకున్న డిజిటల్ కంటెంట్!

2021 Hindi Ott Releases

2021 Hindi OTT Releases: 2021లో బాలీవుడ్ థియేటర్స్ కొచ్చిన సినిమాలే చాలా తక్కువ. అందులో హిట్స్ ఇంకా తక్కువ. అయితే కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. కొవిడ్ టైమ్ లో థియేటర్స్ ధైర్యం చేయకుండా డిజిటల్ షో వేసిన మేకర్స్ కు లక్కీ ఛార్మ్ గా మారాయి.

NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

బాలీవుడ్ మేకర్స్ చాలామంది 2021లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేశారు. పెట్టుబడికి గిట్టుబాటు అనిపిస్తే చాలు.. ఓటీటీకి ఓటేశారు. నెట్ ఫ్లిక్స్ లో త్రిభంగా, పరిణితీ చోప్రా ది గర్ల్ ఆన్ ది ట్రైన్, పగ్లైత్, అజీబ్ దాస్తాన్స్, సర్దార్ కా గ్రాండ్ సన్, హసీన్ దిల్రుబా, అన్ కహీ కహానియా, మీనాక్షి సుందరేశ్వర్, ధమాకా సినిమాలొచ్చాయి. వీటిలో కాజోల్ త్రిభంగా, తాప్సీ హసీన్ దిల్రుబా, రొమాంటిక్ కామెడీ మీనాక్షి సుందరేశ్వర్, ధమాకా మంచి టాక్ తెచ్చుకున్నాయి.

NBK 107: ఈసారి బాలయ్యతో తలపడేది యాక్షన్ కింగేనా?

అమెజాన్ ప్రైమ్ వేదికగా ది ఇల్లీగల్, హలో ఛార్లీ, షెర్నీ, తుఫాన్, షెర్షా, సర్ధార్ ఉద్దమ్, డిబ్బుక్, ఛోరీ సినిమాలు 2021లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసాయి. రెండు మూడు తప్పించి అన్ని ప్రాజెక్ట్స్ మంచి వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయి. అయితే వీటిలో విద్యా బాలన్ షేర్నీ, ఫర్హాన్ అక్తర్ తుఫాన్, సిద్ధార్ద్ మల్హోత్రా షేర్షా, విక్కీ కౌశల్ సర్ధార్ ఉద్దమ్ సినిమాలకు హై రెస్పాన్స్ వచ్చింది. రిపీటెడ్ ఆడియెన్స్ ఉన్నారు ఈ సినిమాలకి.

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

ది బిగ్ బుల్, హప్ బి అఖేలే తుమ్ బి అఖేలే, కోలార్ బాంబ్, భూత్ పోలీస్, షాదిస్తాన్, హంగామా2, భుజ్, షిద్ధత్, సనక్, హమ్ దో హమారే దో, క్యాష్, అత్రాంగి రే సినిమాలో హాట్ స్టార్ 2021 లిస్ట్ లో సందడి చేస్తున్నాయి. వీటిలో మ్యాక్సిమన్ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగా హాట్ స్టార్ రీసెంట్ రిలీజ్ అత్రాంగి రే ఓటీటీలో బంపర్ హిట్ కొట్టింది.

Sonal Chauhan: సోనాల్ అందాల జాతర.. హీట్ పుట్టిస్తున్న ఫోటో షూట్!

జీ5 విషయానికొస్తే లాహోర్ కాన్ఫిడెన్ఫిషియల్, రాధే, 14ఫెరే, డయల్ 100, హెల్మెట్, రష్మీ రాకెట్, బాబ్ విశ్వాస్ లాంటి సినిమాలొచ్చాయి. ఇలా భారీ బడ్జెట్ లేని సినిమాలు, హై స్టార్ కాస్ట్ లేని ప్రాజెక్ట్స్ భారీగా బాలీవుడ్ లో ఓటీటీ బాటపట్టాయి. ఓటీటీ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. నెక్ట్స్ ఇయర్ పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకుంటే ఈ లెవెల్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు ఉండకపోవచ్చు.