NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

తెలుగు సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా అయింది. స్టార్ హీరోల సినిమాలు కుదిరితే సౌత్ అన్ని బాషలలో వీలయితే పాన్ ఇండియా స్థాయిలో సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా మన యంగ్ స్టార్ హీరోలు పాన్..

NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

Ntr Allu Arjun

NTR-Allu Arjun: తెలుగు సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా అయింది. స్టార్ హీరోల సినిమాలు కుదిరితే సౌత్ అన్ని బాషలలో వీలయితే పాన్ ఇండియా స్థాయిలో సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా మన యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇండియన్ సినిమా అంటే ఊరికే రాదు కదా మరి. దాదాపు పదికిపైగా బాషలలో విడుదల చేయాలి. మరి ఇన్ని బాషలలో మన హీరోలు డబ్బింగ్ చెప్పాలి. లేదంటే ఆ భాషలో మరొకరితో డబ్బింగ్ చెప్పించాలి. అయితే.. ఆ డబ్బింగ్ చాలా మంది హీరోలకు నచ్చడం లేదు.

Sai Pallavi: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సాయిపల్లవి

పరభాషా నటులు మన దగ్గర నటిస్తూ వాళ్ళకి మరొకరు డబ్బింగ్ చెప్తుంటే ఎలా ఉంటుందో చాలా సినిమాలలో చూస్తూనే ఉన్నాం. అందునా హీరోలంటే వాయిస్ లో ఒక యూనిక్ ఉంటుంది. అది డబ్బింగ్ ఆర్టిస్టులు పట్టుకోవడం చాలా కష్టం. అందుకే మన హీరోలు ఇప్పుడు ఇతర బాషల డబ్బింగ్ మీద కూడా కాన్షన్ ట్రేట్ చేస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయి బంపర్ హిట్ కొట్టిన పుష్ప తెలుగుతో పాటు సౌత్ అన్ని భాషలు, హిందీలో కూడా విడుదలైంది. అయితే.. బన్నీ ఒక్క తెలుగుకు మాత్రమే డబ్బింగ్ చెప్పాడు. మిగతా అన్ని బాషలకు నో చెప్పేశాడు.

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

ఏ భాషకి ఆ భాషల్లో సొంత ప్రామాణికత వుంటుందని దాన్ని పాడు చేయడం తనకు ఇష్టం లేకనే ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పలేదన్నాడు బన్నీ. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సై అన్నారు. ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్` దాదాపుగా 14 భాషల్లో విడుదలవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషలతో పాటు ఇండియాలోని మిగతా బాషలలో కూడా విడుదలవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఒక్క మలయాళం తప్ప మిగతా ప్రధానమైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషలకు సొంతం చెప్పుకున్నాడు.

Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

బన్నీ వద్దనుకున్నా.. తారక్ డబ్బింగ్ చెప్పుకోడానికి అనేక కారణనున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ కానున్నారని ధీమా కనిపిస్తుంది. దీంతో రాబోయే అన్ని సినిమాలు ఇదే స్థాయిలో విడుదల కావాల్సి ఉంటుంది. వాటికి కూడా డబ్బింగ్ చెప్పాలంటే ఇక్కడ నుండే అలవాటు చేసుకోవాలనే తారక్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. తెలుగు మాతృబాష కాగా.. ఆయన తల్లి సొంత భాషైన కన్నడ మీద మంచి పట్టుంది. అలాగే హిందీ, తమిళం కూడా అలవాటున్న భాషే కాగా డబ్బింగ్ లో మాతృక కోసం ఓ ట్యూటర్ ద్వారా నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడట.