Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. పేరుకు ఇండియన్ సినిమా అయినా అందులో సవాలక్ష చీలికలు ఉండేవి. బాలీవుడ్ మేజర్ వాటా తీసుకుంటే.. ఆ తర్వాత సౌత్ లో తమిళ్ సినిమా మరో మేజర్ వాటా తీసుకొనేది.

Karthikeya: ‘తల’తోనే ఢీ అంటే ఢీ.. యంగ్ హీరో ఫేట్ మారిపోతుందా?

Karthikeya

Karthikeya: ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. పేరుకు ఇండియన్ సినిమా అయినా అందులో సవాలక్ష చీలికలు ఉండేవి. బాలీవుడ్ మేజర్ వాటా తీసుకుంటే.. ఆ తర్వాత సౌత్ లో తమిళ్ సినిమా మరో మేజర్ వాటా తీసుకొనేది. అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ హీరోలకు మిగతా వారికంటే కాస్త ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. కానీ.. ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపుతుంటే.. మన హీరోలు దునియాని దున్నేసేలా జెట్ స్పీడ్ మైంటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన యంగ్ హీరోలు ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడ పాగా వేసేస్తున్నారు.

Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

ఇప్పటికే మన యంగ్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ దిగిపోయి మన సత్తా ఏంటో చూపించేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ మాత్రమే కాదు నాగ చైతన్య, శర్వానంద్, రానా లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అక్కడా అనిలేకుండా సొంత బేస్ మార్కెట్ ను పెంచుకొనే పనిలో ఉండగా.. ఇప్పుడు మరో యంగ్ హీరో కార్తికేయ కూడా అదే బాటలో పయనం మొదలు పెట్టాడు. అందుకు తొలి అడుగుగా ఓ క్రేజీ ఆఫర్ దక్కడం విశేషం.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

తమిళ్‌ హీరో అజిత్‌ క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ హీరో అజిత్‌ కు ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం హీరో అజిత్‌ వాలీమై సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు వినోద్‌ దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో తెలుగు హీరో కార్తికేయ నెగటివ్ పాత్రలో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్‌లన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోన్నట్టు కనిపించిన ఈ ట్రైలర్ లో అజిత్ ను ఢీ అంటే ఢీ అన్నట్లుగా కార్తికేయను చూపించారు.

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

దీంతో ఇప్పుడు అందరి చూపు కార్తికేయపై పడింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో వెండితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ ఆ తర్వాత అరడజను సినిమాలు చేసినా మళ్ళీ ఆర్ఎక్స్ స్థాయి హిట్ దక్కలేదు. అయితే.. ఇప్పుడు అజిత్ వలిమైతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరి వలిమై విడుదల తర్వాత కార్తికేయ ఫేట్ మారిపోతుందా.. వలిమై అవకాశాన్ని కార్తికేయ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.