Ghani: గని కోసం వరుణ్ వేరియేషన్.. ఆశలు తీరుస్తుందా?

లవర్ బాయ్ గా అట్రాక్ట్ చేశాడు.. పక్కింటి కుర్రాడిగా పలకరించాడు.. పక్కా మాస్ క్యారెక్టర్ లో నూ పెర్ఫామ్ చేసిన వరుణ్ తేజ్. ఈసారి మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ హీరోగా బ్రేక్..

Ghani: గని కోసం వరుణ్ వేరియేషన్.. ఆశలు తీరుస్తుందా?

ghani

Ghani: లవర్ బాయ్ గా అట్రాక్ట్ చేశాడు.. పక్కింటి కుర్రాడిగా పలకరించాడు.. పక్కా మాస్ క్యారెక్టర్ లో నూ పెర్ఫామ్ చేసిన వరుణ్ తేజ్. ఈసారి మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ హీరోగా బ్రేక్ తీసుకుందామనుకుంటున్నాడు. గని సినిమా వరుణ్ తేజ్ గంపెడు ఆశలు తీరుస్తుందా?

Ghani: గని కోసం దిగుతున్న పుష్ప.. తగ్గేదే లే!

ఈనెల 8న రిలీజ్ కానున్న వరుణ్ తేజ్ గని హంగామా మొదలైంది. ఏప్రిల్ 2 ఉగాది శుభకృత్ నామ సంవత్సరంలో మొదటి తెలుగు సినిమా ప్రి రిలీజ్ వేడుక గా గని ఈవెంట్ జరగబోతుంది. వైభవంగా వైజాగ్ లో జరగనున్న ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వైజాగ్ లో జరగనున్న ఈ ఈవెంట్ పై మెగా ఫ్యాన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన గని ప్రమోషనల్ వీడియోస్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Ghani: కొడ్తే.. అంటూ అందాలతో కొట్టిన తమన్నా!

పక్కా మేకొవర్ తో గని కోసం బాడీ ఫిట్నెస్ పెంచాడు వరుణ్ తేజ్. లవర్ బాయ్ ఇమేజ్ కు భిన్నంగా రగ్డ్ అండ్ రఫ్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన గని ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ వేరియేషన్ కోసం మెగాప్రిన్స్ బాగానే కష్టపడ్డట్టు తెలుస్తోంది. ఫన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటే హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో బాక్సింగ్ గనిగా వరుణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Ghani Movie: వరుణ్ యాక్షన్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా?

ఇప్పటి వరకూ వరుణ్ తేజ్ సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నా కూడా పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించలేదు. సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ తోనే బాక్సింగ్ రింగ్ లోకి దూకాడు వరుణ్ తేజ్. ఇదివరకు చూడని వరుణ్ తేజ్ ని గని సినిమాలో ప్రెజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి. సూపర్ పర్సనాలిటి.. అంతకు మించిన అగ్రెసివ్ మోడ్ లో వరుణ్ యాక్షన్ లుక్ హైలైట్ అనిపిస్తోంది. ఈ సినిమాతో పవర్ ఫుల్ యాక్షన్ బ్రేక్ కావాలని చూస్తున్న వరుణ్ తేజ్ ఆశలను గని తీరుస్తుందా లేదా తెలియాలంటే ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే.